ఏపీలో వారిపై మరింత నిఘా... 50 మీటర్లు దాటి వెళ్లారో...

హౌస్ క్వారంటైన్ యాప్ పేరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

news18-telugu
Updated: March 27, 2020, 8:01 PM IST
ఏపీలో వారిపై మరింత నిఘా... 50 మీటర్లు దాటి వెళ్లారో...
రాత్రి 7 గంటల లోపే తెలంగాణ దాటి వెళ్లిపోవాలన్నారు.
  • Share this:
మన దేశంలో విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాధి ఎక్కువగా వ్యాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారి ద్వారా ఇతరులకు సోకిన కేసులు ఉన్నప్పటికీ... ఎక్కువగా వారి ద్వారానే ఈ వైరస్ ప్రమాదం మనకు ఎక్కువగా పొంచి ఉంది. కొన్ని చోట్ల ఇలాంటి వాళ్లు హోం క్వారంటైన్‌లో ఉండకుండా పారిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వీరిని క్వారంటైన్‌లో ఉండేలా చేయడం ప్రభుత్వానికి కూడా సవాల్‌గా మారింది. అయితే తాజాగా ఏపీ పోలీసులు ఇందుకోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హౌస్ క్వారంటైన్ యాప్ పేరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్‌లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను పోలీసులు పొందుపరిచారు.

మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను పోలీసులు నమోదు చేయనున్నారు. అప్లికేషన్‌లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్‌కు ఆటో మేటిక్‌గా సమాచారం వస్తుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో తన మేధస్సును నిబద్ధతను చాటి చెబుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: March 27, 2020, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading