AP Corona: మంత్రి వెల్లంపల్లికి కరోనా.. జగన్ ఆరోగ్యంపై ఆందోళన

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

AP Corona: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఇటీవల జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటీవ్ గా తేలింది. అయితే బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ కూడా పాల్గొనడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Share this:
    ఏపీని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య ఏడు లక్షలను సమీపిస్తుండడం అందోళన కలిగిస్తోంది. నిన్న కూడా అక్కడ 6923 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవల వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కరోనాతో చనిపోయిన విషయం తెలిసిందే. బీజేపీకి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు సైతం కరోనాతో కన్నుమూశారు. అయితే టెస్టులు ఎక్కువ చేయడంతోనే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జగన్ సర్కార్ కరోనా కట్టడిలో విఫలమైందని, అందుకే అత్యధికంగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

    తాజాగా ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి స్వామి వారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి శ్రీనివాస్ దాదాపు వారం రోజుల పాటు తిరుమలలోనే ఉండి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈనెల 25వ తేదీన ఆయన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

    AP Corona, Vellampalli Sreenivas Corona, CM Jagan Corona, CM Jagan Health, CM Jagan Fans, AP Governament, Thirumala, Thirumala Bramhothsavalu, AP Minister Corona, ఏపీ మంత్రికి కరోనా, వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా, తిరుపతి బ్రహ్మోత్సవాలు, ఏపీలో కరోనా, సీఎం జగన్, సీఎం జగన్ ఆరోగ్యం, సీఎం జగన్ కరోనా
    తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పక్కన మంత్రి వెల్లంపల్లి


    సీఎం ఆరోగ్యంపై ఆందోళన..
    తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ హాజరైన సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన వెంటే ఉన్నారు. జగన్ హైదరాబాద్ బయలేదేరే వరకు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే ఇప్పుడు వెల్లంపల్లికి కరోనా సోకడంతో జగన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప సైతం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాడ్యూరప్ప ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: