తెలంగాణ అధికారులపై ఏపీ మంత్రి అసహనం...

తెలంగాణ అధికారులపై ఏపీ మంత్రి అసహనం...

వైసీపీ నేత పేర్ని నాని (File)

తెలంగాణలోని కొందరు అధికారులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే... నిన్న ఏపీ సరిహద్దు వద్ద గందరగోళానికి కారణమని ఏపీ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు.

 • Share this:
  తెలంగాణలోని కొందరు అధికారులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే... నిన్న ఏపీ సరిహద్దు వద్ద గందరగోళానికి కారణమని ఏపీ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్‌ఓసీ తీసుకున్న ఏపీకి పయనమైన వారిని... జగ్గయ్యపేట బార్డర్‌కు వచ్చే వరకు కష్టాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర సరిహద్దు దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని నిందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తమకు ఎలాంటి అనారోగ్యం లేదని అక్కడున్న కొందరు చెబుతున్నారు.. ఈ వ్యాధి 14 రోజుల్లో ఎప్పుడైనా బయటపడే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు.

  తెలంగాణ అధికారుల హాస్టల్స్ ఖాళీ చేసి ఏపీ ప్రజలను పంపించే ముందు ఇక్కడి అధికారులను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి తెలిసిన తరువాత ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారని... అక్కడి అధికారులతో మాట్లాడి మళ్లీ హాస్టల్స్‌ ఎప్పటిలాగే కొనసాగేలా చూశారని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు