హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

పాతపట్నంలో ఆకస్మిక పర్యటన... మాస్క్ వాడని ఆరోగ్య శాఖ మంత్రి

పాతపట్నంలో ఆకస్మిక పర్యటన... మాస్క్ వాడని ఆరోగ్య శాఖ మంత్రి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రెడ్ జోన్ ఏరియాలో పర్యటించిన మంత్రి ఆళ్ల నాని

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రెడ్ జోన్ ఏరియాలో పర్యటించిన మంత్రి ఆళ్ల నాని

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆకస్మికంగా పర్యటించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆకస్మికంగా పర్యటించారు. కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో ఒకేసారి మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో వారిలో ధైర్యం నింపేందుకు, అక్కడ చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై చర్చించేందుకు ఆళ్ల నాని పాతపట్నంలో పర్యటించారు. ఆ ఏరియా లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మొబైల్ రైతు బజార్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 24గంటలు పనిచేయడం కోసం చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం పోలీస్ పికెట్ పని చేయడానికి పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. 50పడకలతో క్వారంటైన్ ఏర్పాటు చేయాలన్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఇంటింటికి సర్వే చేయడానికి మెడికల్ టీమ్ సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. 500 ర్యాపిడ్ కిట్స్ అందచేశామని, మొబైల్ ATM కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పాత పట్నం కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ ను 30బెడ్స్ హాస్పిటల్ గా ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

పాతపట్నంలో పర్యటిస్తున్న సమయంలో మంత్రి ఆళ్ల నాని కనీసం మాస్క్ వాడకపోవడం విమర్శకు తావిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున సుమారు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తోంది. అందులో కొన్ని పంపిణీ చేశారు. మంత్రి వెంట ఉన్న అధికారులు, పోలీసులు అందరూ కూడా మాస్క్ వినియోగించారు. వారిని చూసి కూడా మంత్రి మాస్క్ వినియోగించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

First published:

Tags: Alla Nani, Andhra Pradesh, Coronavirus, Covid-19