Home /News /coronavirus-latest-news /

AP GOVT OPENS SPECIAL HELPLINE NUMBERS AS DOMESTIC VIOLENCE INCREASE IN LOCKDOWN SK

లాక్‌డౌన్ వేళ మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

    కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆఫీసులన్నీ మూతపడ్డాయి. భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటున్నారు. ఐతే కొందరు భర్తలు భార్యల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని.. లాక్‌డౌన్ పీరియడ్‌లో గృహహింస పెరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 13 జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇవి 24 గంటల పాటు మహిళలకు అందుబాటులో ఉంటాయి. వన్ స్టాప్ సెంటర్ నుంచే మహిళలకు నిపుణుల ద్వారా వైద్యఆరోగ్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయం అందిస్తారు. అంతేకాదు 23 స్వాధార్ గృహాల్లో బాధిత మహిళలకు వసతి, రక్షణ కల్పిస్తారు. ఉమెన్ హెల్ప్ లైన్ 181 సైతం 24 గంటలు అందుబాటులో ఉంది. ఇది కాక.. జిల్లాల వారీగా ప్రత్యేకంగా గృహ హింస బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్‌లను ఏర్పాటు చేశారు.

    జిల్లాల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నంబర్లు

    శ్రీకాకుళం – 9110793708

    విశాఖపట్టణం – 6281641040

    పశ్చిమ గోదావరి - 9701811846

    గంటూరు – 9963190234

    నెల్లూరు - 9848653821

    కర్నూలు – 9701052497

    అనంతపురం – 8008053408

    విజయనగరం - 8501914624

    తూర్పుగోదావరి - 9603231497

    కృష్ణ - 9100079676

    ప్రకాశం - 9490333797

    చిత్తూరు - 9959776697

    కడప - 8897723899
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Domestic Violence, Lockdown

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు