Home /News /coronavirus-latest-news /

AP GOVT CLARIFIES ABOUT SOCIAL MEDIA RUMORS ABOUT BORDER CHECK POSTS AND QUARANTINE BA

ఏపీలో చెక్ పోస్టులు ఎత్తేశారా? క్వారంటైన్ అక్కర్లేదా?.. ప్రభుత్వం క్లారిటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో సరిహద్దు చెక్ పోస్టులు తీసేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

    ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారి కోసం సరిహద్దుల్లో చెక్ పోస్టులు తీసేశారని, ఎలాంటి కరోనా పరీక్షలు లేకుండానే రాష్ట్రంలోకి రావొచ్చంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. సరిహద్దుల్లో చెక్ పోస్టులను తొలగించడం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా సరిహద్దుల వద్ద చెక్‌ పాయింట్లను యథాతథంగా నిర్వహిస్తామని ప్రభుత్వ నోడల్‌ అధికారి కృష్ణబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, ఏపీలోకి రావాలనుకునేవారు స్పందన వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. అలా రాష్ట్రంలోకి వచ్చిన వారు వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేశారు.

    అంతర్రాష్ట్ర రాకపోకల్లో సడలింపులు వచ్చాయని, ఏపీకి వెళ్లాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఎటువంటి ఆంక్షలు లేవని, చెక్ పోస్టులు రేపటి నుంచి ఎత్తివేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అవన్నీ తప్పుడు పోస్టులు అని పోలీసు అధికారులు కూడా స్పష్టం చేశారు. గురజాల డీఎస్పీ ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి ఇప్పటివరకు ఏ ఏ ఆంక్షలు అయితే ఉన్నాయో అవే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎవరైనా పొరుగు రాష్ట్రం నుండి రావాలనుకుంటే తప్పనిసరిగా ఈపాస్ ఉంటేనే ఏపీ లోకి అనుమతి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు కొనసాగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మి మోసపోవద్దని సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Lockdown, Lockdown relaxations

    తదుపరి వార్తలు