ఏపీలోని ఈ జిల్లాలో బిచ్చగాళ్లకూ ‘కరోనా కిట్లు..’

Andhra Pradesh Corona | రోడ్డు మీద బిచ్చగాళ్లకు మాస్క్ లు, సబ్బులు అందిస్తుంది ఏపీ ప్రభుత్వం.

news18-telugu
Updated: July 16, 2020, 2:44 PM IST
ఏపీలోని ఈ జిల్లాలో బిచ్చగాళ్లకూ ‘కరోనా కిట్లు..’
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్, ఏపీ కరోనా కేసులు, బిచ్చగాళ్లకు కరోనా కిట్లు, కృష్ణా జిల్లాకరోనా వైరస్ మహమ్మారి మన జీవన విధానాన్నే మార్చేసింది. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికే ఇది దినచర్యలా మారింది. అలాగే, రాబోయే రోజుల్లో కూడా కొనసాగనుంది. ఇవన్నీ చేయడానికి కొంత డబ్బు కావాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఎలాగో తమకు వచ్చిన దాంట్లో మాస్క్ లు, శానిటైజర్లు కొనుక్కుంటారు. మరి ఎవరూ లేని అనాథలు, రోడ్ల మీద బిచ్చం ఎత్తుకునే వారి పరిస్థితి ఏంటి? ప్రస్తుత రోజుల్లో జనం వారి దగ్గరకు కూడా వెళ్లి దానం చేయడానికి భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి కూడా మాస్క్ లు, సబ్బులు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది.  ప్రభుత్వ విభాగం మెప్మా ఆధ్వర్యంలో బిచ్చగాళ్లకు కూడా కరోనా కిట్లు అందిస్తున్నారు. ఆరు మాస్క్‌లు, 2 సబ్బులు ఉండే ఈ కిట్ ఖరీదు రూ.70.

తొలిసారిగా కృష్ణా జిల్లాలోని బెగ్గర్స్‌కు దీన్ని అందిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 997 మంది, మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 230, గుడివాడ అర్బన్ ఏరియలో 300 మంది, తిరువూరులో 94, జగ్గయ్యపేటలో 80, నందిగామలో 68, నూజివీడులో 60, పెడనలో 58, ఉయ్యూరులో 34 మొత్తం కలిపి 1991 కుటుంబాలను గుర్తించారు. మెప్మా ఆధ్వర్యంలో కరోనా కిట్లను వారికి అందజేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 16, 2020, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading