AP Lockdown | గుంటూరులో రెడ్ జోన్‌గా ప్రకటించిన కాలనీలు ఇవే..

గుంటూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని కాలనీలను రెడ్ జోన్‌గా ప్రకటించింది.

news18-telugu
Updated: March 27, 2020, 12:34 PM IST
AP Lockdown | గుంటూరులో రెడ్ జోన్‌గా ప్రకటించిన కాలనీలు ఇవే..
సీఎం జగన్, ఏపీ మ్యాప్
  • Share this:
గుంటూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ వ్యక్తితో పాటు.. బంధువులైన ఐదుగురి పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడితో కలిసి ప్రయాణించిన 16 మందిని, ఆయనకు దగ్గరగా తిరిగిన మరో 13 మందిని వారి హౌస్‌ క్వారంటైన్‌కు తరలించారు. అ నేపథ్యంలో గుంటూరులో కొన్ని కాలనీలను రెడ్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. ఆ జాబితాలో మంగళదాస్ నగర్, అరుంధతి నగర్, ఆర్టీసీ కాలనీ, అంబేద్కర్ నగర్, సీత నగర్, నెహ్రూ నగర్, వాసవి నగర్ ఉన్నాయి.

ఈ ఏరియాల్లో ప్రజలు బయటికి రావొద్దని, బయటి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు దాటివ వారెవరూ బయటకు రావద్దని సూచించారు. ఈ ఏరియాల్లో శానిటైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఏపీ వ్యాప్తంగా మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు