కరోనాపై అవగాహన కోసం ఇంటింటి సర్వే... ఏపీ ప్రభుత్వం నిర్ణయం

కరోనా వైరస్ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు రెండు కరపత్రాలను ప్రచురించామని ఏపీ సీఎస్ నీలం సాహ్ని అన్నారు.

news18-telugu
Updated: May 23, 2020, 10:23 PM IST
కరోనాపై అవగాహన కోసం ఇంటింటి సర్వే... ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 25వ తేదీ నుండి కరోనా వైరస్ పై ఇంటింటా సర్వే ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎస్ నీలం సాహ్ని వెల్లడించారు. కరోనా వైరస్ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు రెండు కరపత్రాలను ప్రచురించామని అన్నారు. వాటిని జిల్లాల్లో అవసరమైన సంఖ్యలో ప్రచురించి అవి ప్రతి ఇంటికీ పంపిణీ చేసి వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈనెల 25వతేది సోమవారం నుండి చేపట్టే 5వ విడత ఇంటింటా సర్వేలో ప్రధానంగా కరోనా ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు.

ఎఎన్ఎం, ఆశావర్కర్, గ్రామ, వార్డు వాలంటీర్లు తో కూడిన బృందం ఇంటింటీకీ వెళ్ళి ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పారు. ఇందుకుగాను సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలు-పరీక్ష-చికిత్సపై ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణ మార్గాలు పేరిట మరో కరపత్రాన్ని ముద్రించారు. దానిలో ముఖ్యంగా కరోనా లక్షణాలు, అది ఎలా సంక్రమిస్తుంది, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలు ముద్రించి ఈ రెండు కరపత్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25 నుండి చేపట్టే 5వ విడత ఇంటింటా సర్వే ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోనున్నారు.First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading