అమరావతి గ్రామాల్లో దాక్కున్నారు... ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: March 28, 2020, 6:56 PM IST
అమరావతి గ్రామాల్లో దాక్కున్నారు... ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)
  • Share this:
అమరావతి గ్రామాల్లో కొందరు సమాచారం ఇవ్వకుండా దాక్కున్నారని తెలిసిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అలాంటి వారికి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిపై కేసుల నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. చుట్టూ ఉన్న సమాజానికి ఎవరూ నష్టం చేయొద్దని ఆయన హితవు పలికారు. 45 వేల మందికిపైగా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్న ఏపీ డీజీపీ... వీరంతా వెంటనే వైద్య బృందాలకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము చేస్తున్న ప్రయత్నం ప్రజల కోసమే అని తెలుసుకోవాలని సూచించారు. పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణలో మనల్ని మనం కాపాడుకుందామని సూచించారు. పోలీసులకు అందరూ సహకరించాలన్నారు. వైరస్‌ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్‌ చేద్దామని తెలిపారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉందామన్నారు. ఖాళీ రోడ్లపై యాక్సిడెంట్లు జరిగిన విషయం తెలిసిందన్నారు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండేలా ఆదేశాలిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాలని ఏపీ డీజీపీ సవాంగ్ సూచించారు.

First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading