ప్రత్యేక యాప్‌తో కరోనాకు చెక్ పెడుతున్న ఏపీ పోలీసులు..

ప్రత్యేక యాప్ సహాయంతో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నామని ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పోలీస్ శాఖ సాంకేతికత బృందాన్ని అభినందించారు.

news18-telugu
Updated: April 24, 2020, 12:00 PM IST
ప్రత్యేక యాప్‌తో కరోనాకు చెక్ పెడుతున్న ఏపీ పోలీసులు..
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రత్యేక యాప్ సహాయంతో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నామని ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పోలీస్ శాఖ సాంకేతికత బృందాన్ని అభినందించారు. కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు సీఎం జగన్ సారథ్యంలో పోలీసు శాఖ అన్ని చర్యలను తీసుకుంటోందని అన్నారు. వివిధ దేశాల నుండి ఏపీకి వచ్చిన వారిపై నిఘా కోసం అత్యంత సాంకేతికత పరిజ్ఞానం వినియోగించామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పర్యవేక్షించామని ఆయన వెల్లడించారు. మొత్తం 22,478 మందిపై 28 రోజుల పాటు నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. అయితే, జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు కూడా పెట్టామని డీజీపీ తెలిపారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టామని వెల్లడించారు.

28 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిపై ప్రత్యేక ఆంక్షలను తొలగించామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైల్ యాప్ సిద్ధం చేస్తున్నామని వివరించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 24, 2020, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading