మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా గుంటూరు జిల్లా

నియోజకవర్గాలలో టెస్టులు అధికంగా నిర్వహిస్తున్న కొద్దీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో సైతం డ్యూటీలు నిర్వహించిన పోలీసులు, రెవెన్యూ, మునిసిపల్, పంచాయితీ రాజ్ కార్యాలయల్లోని సిబ్బందికి సైతం పొజిటీవ్ కేసులు రావడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

news18-telugu
Updated: July 16, 2020, 1:13 PM IST
మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా గుంటూరు జిల్లా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(రఘు అన్నా, న్యూస్ 18 ప్రతినిధి, గుంటూరు)

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో రోజు రోజుకి కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్క రోజె జిల్లా వ్యాప్తంగా 568 కేసులు నోమోదు కావడంతో కరోన విజృంభన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు, జిల్లా లో ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదైన కరోన కేసుల సంఖ్య 5000 పైచిలుకు కాగా వారిలో 1829 మనది కరోన మహమ్మరిని జయించారు, ఇప్పటికీ 32 మంది కరోనాకు బలి అయ్యారు.

అయితే లాక్ డౌన్ సడలింపులో భాగంగా అన్ని వ్యాపార సంస్తలకు ప్రభుత్వం నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది, ఇక్కడే అసలు సమస్య మొదలయింది, కరోన వైరస్ భారీ నుండి కోలుకుని తిరిగి వస్తున్నారని ఆనంద పడేలోపే, అప్పటి వరకు ఒక్క కేసు కూడా లేని ప్రాంతాలలో కేసులు సంఖ్య పెరుగ సాగింది, గ్రామాలకు సైతం కరోన సోకడంతో ప్రజల భయాందోనలకు గురి అవుతున్నారు, లాక్ డౌన్ మొదట్లో జిల్లా వ్యాప్తంగా గుంటూరు, నరసరావుపేటకి మాత్రమే పరిమితమైన కరోన కేసులు ఇప్పుడు అదే స్థాయిలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలు కేసులు నమోదు అవుతున్నాయి.

నియోజకవర్గాలలో టెస్టులు అధికంగా నిర్వహిస్తున్న కొద్దీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో సైతం డ్యూటీలు నిర్వహించిన పోలీసులు, రెవెన్యూ, మునిసిపల్, పంచాయితీ రాజ్ కార్యాలయల్లోని సిబ్బందికి సైతం పొజిటీవ్ కేసులు రావడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతే కాకుండా ప్రముఖ దేవాలయ సిబ్బందికి, పూజరులకి కరోన సోకడంతో దేవాలయాలు సైతం మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి విపత్కార పరిస్థిలలో తెనాలి నిమ్మకాయ మార్కెట్,గుంటూరు అల్లం వెల్లులి ట్రేడర్స్ అసోసియేషన్ వారు తమంతట తాముగా స్వచ్చందంగా తమ వ్యాపార కార్యకలాపాలను మూసివేశారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.

ఇలాంటి పరిస్థితులకు కారణం అధికారుల నిర్లక్ష్యమా? ప్రజలు నిబంధనలు పాటించకపోవడమా ? అనేది చిక్కు ప్రశ్న గా మిగిలిపోయింది, పరిస్తితులు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడంలో అదుకారులు వైఫల్యాలు కూడా లేకపోలేదు, అయితే ఇప్పటి పరిస్థితుల్లో మరో సారి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ ఏర్పాటు చేసి కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు, మరి ఇప్పటికైనా అధికారులు ఒక్క అడుగు మరింత ముందుకు వేసి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో లేదో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: July 16, 2020, 1:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading