వైఎస్ జగన్ బంధువు, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

Kadapa MP tested Corona positive | జగన్ టూర్ నేపథ్యంలో కడపలో వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: August 30, 2020, 3:49 PM IST
వైఎస్ జగన్ బంధువు, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి
  • Share this:
YS Avinash Reddy | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తన వెంట గత వారంరోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,14,164కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 3,796 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి 3,12,687 మంది బాధితులు కోలుకున్నారు ఏపీలో ప్రస్తుతం 97,681 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 62,024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.ఏపీలో ఇప్పటివరకు 36.03 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 30, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading