ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. సీఎం జగన్ ఏం కోరారంటే..

ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

PM Modi Video Conference : ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్ని కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రంలో వ్యవసాయ, దాని ఆధారిత రంగాలకు మినహాయింపులు ఇవ్వాలని గతంలో కోరిన జగన్.. ఇప్పుడు కూడా అవే సడలింపు కొనసాగించాలని విన్నవించారు.

  • Share this:
    PM Modi Video Conference : లాక్‌డౌన్ ఎలా కొనసాగుతోంది? ఎక్కడెక్కడ కరోనా నియంత్రణలోకి వచ్చింది? రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉంది? లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? లేక కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగించాలా? తదితర అంశాలపై ప్రధాని మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాపై కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పి, మినహాయింపులపై సీఎంల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్ని కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రంలో వ్యవసాయ, దాని ఆధారిత రంగాలకు మినహాయింపులు ఇవ్వాలని గతంలో కోరిన జగన్.. ఇప్పుడు కూడా అవే సడలింపు కొనసాగించాలని విన్నవించారు.

    రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, రెడ్‌జోన్ల వారీగా సడలింపులు ఇవ్వాలని మరోసారి ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమచారం. జోన్ల వారీగా సడలింపులు ఇస్తే.. కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయన్నది సీఎం జగన్ ఆలోచించి ఆ మేరకు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. అటు.. 235 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.


    Published by:Shravan Kumar Bommakanti
    First published: