Andhra Pradesh Lockdown: మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం జగన్ ?

మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్న ఏపీ ముఖ్యమంత్రి... ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తారా అనే అంశంపై ప్రజలందరిలో ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: March 26, 2020, 3:19 PM IST
Andhra Pradesh Lockdown: మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం జగన్ ?
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
మరికాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ భేటీలో ఏయే నిర్ణయాలు ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్‌ను ఏపీలోనూ కొనసాగిస్తున్న ప్రభుత్వం... దీన్ని మరింత కఠినంగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నిన్న తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చేందుకు పలువురు రాష్ట్ర ప్రజలు ప్రయత్నించడం... వారిని పోలీసులు అడ్డుకోవడంతో చాలాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఏపీ సీఎం జగన్ రంగంలోకి సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరగడం, కూరగాయల సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తన మీడియా సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిరుపేదలకు ఈ లాక్ డౌన్ కారణంగా మరింత సాయం చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. వారి అందించే సాయాన్ని మరింత పెంచే యోచనలో ఏపీ సర్కార్ ఉందని... దీనిపై సీఎం జగన్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

కరోనా కారణంగా విద్యార్థుల పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో... 9వ తరగతి వరకు విద్యార్థులందరూ పాస్ అయినట్టే భావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం జగన్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని... వాటిని ఈ సమావేశంలోనే ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్న ఏపీ ముఖ్యమంత్రి... ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తారా అనే అంశంపై ప్రజలందరిలో ఆసక్తి నెలకొంది.



First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు