హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Andhra Pradesh: ఏపీలో కరోనాకు ఉచిత వైద్యం.. మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

Andhra Pradesh: ఏపీలో కరోనాకు ఉచిత వైద్యం.. మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

ఏపీలో కరోనా విస్తరిస్తున్న సమయంలో పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ కిందకు చేర్చారు. కరోనా కోసం ఉచిత వైద్య సేవలు అందించాలని. 50 శాతం బెడ్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆక్సిజన్ సరఫరాను సైతం పెంచాలని నిర్ణయించారు.

ఏపీలో కరోనా విస్తరిస్తున్న సమయంలో పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ కిందకు చేర్చారు. కరోనా కోసం ఉచిత వైద్య సేవలు అందించాలని. 50 శాతం బెడ్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆక్సిజన్ సరఫరాను సైతం పెంచాలని నిర్ణయించారు.

ఏపీలో కరోనా విస్తరిస్తున్న సమయంలో పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ కిందకు చేర్చారు. కరోనా కోసం ఉచిత వైద్య సేవలు అందించాలని. 50 శాతం బెడ్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆక్సిజన్ సరఫరాను సైతం పెంచాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

  ఏపీని కరోనా భయపెడుతోంది. ప్రతి రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండడం కలవర పెడుతోంది. తాజాగా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 3 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏడు జిల్లాల్లో పరిస్థితి వైరస్ పేరు చెబితే వణికిపోయేలా చేస్తోంది. అయితే రాష్ట్రంలో కరోనా మరణాలు పెరగడానికి సరైన వైద్య సదుపాయం అందకపోవడమే కారణమన్నది బహిరంగ రహస్యమే. దీంతో కరోనా తాజా పరిస్థితి. వైద్య సదుపాయాలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  ఏపీలో కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని హెచ్చరించారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. క్యాంప్‌ కార్యాలయంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. రాష్ట్రంలో పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలని చెప్పారు. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలన్నారు.

  ఇదీ చదవండి: కర్ఫ్యూ కాదు... కఠిన లాక్ డౌన్.. కలవర పెడుతున్న ఆ ఏడు జిల్లాలు

  ఏపీలో రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నామని, మన రికార్డులను మనమే బద్దలు కొడుతున్నామని చెప్పారు. కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నదానిపై పూర్తి క్లారిటీ ఉండాలన్నారు. దాని వల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నామన్నది స్పష్టత వస్తుందన్నారు.

  ఇదీ చదవండి: పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి రవాణా బంద్.. బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం

  ఎవరైనా 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుందన్నారు. వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలని స్పష్టంగా చెప్పారు. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలని చెప్పారు. కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల దగ్గర కోవిడ్‌ కేర్‌ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.

  ఇదీ చదవండి: అటు కరోనా.. ఇటు కర్ఫ్యూ.. పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ ఈ నిబంధనలు మస్ట్

  కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్‌ బాగుండాలని, ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలన్నారు. శానిటేషన్, క్వాలిటీ ఫుడ్, డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ ఐదు చాలా ముఖ్యమని తెలిపారు. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు చేపట్టలన్నారు.

  ఇదీ చదవండి: ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో కూలీగా మారిన సీపీఐ నారాయణ.. ఏం జరిగింది?

  ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని, ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయాలని తెలిపారు. కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సిజన్‌ సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కెఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ సామర్థ్యంతో ఆక్సిజన్‌ స్టోరేజీ ఉండాలని, వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలన్నారు. రోజుకు 500 టన్నుల ఆక్సిజన్‌ కావాలంటే, ఏం చేయాలన్నది ఆలోచించాలని వెల్లడించారు.

  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm jagan, AP News, Corona cases, Corona second wave

  ఉత్తమ కథలు