Home /News /coronavirus-latest-news /

AP CM JAGAN ENQUIRE ABOUT FIRE ACCIDENT HELD IN COVID 19 TREATMENT CENTRE IN VIJAYAWADA OF ANDHRA PRADESH NK

Vijayawada Fire Accident: కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి...భారీ పరిహారం

విజయవాడ అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి... కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

విజయవాడ అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి... కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Vijayawada Fire Accident | విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదం... ఏపీలో పెను సంచలనంగా మారింది. కొవిడ్ కేంద్రంలో ఇది జరగడంతో... ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.

    విజయవాడలోని కొవిడ్ చికిత్సా కేంద్రంలో ఉదయం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరగకుండా ఉండే బాగుండేదే అని ఆయన తీవ్రంగా బాధపడినట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి... బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరగాలనీ, బాధితుల్ని దగ్గర్లోని ఆస్పత్రులకు వెంటనే చేరవేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక స్వర్ణా ప్యాలెస్ హోటల్‌ను రమేశ్ హాస్పిటల్స్, తన కరోనా చికిత్సా కేంద్రంగా వాడుతోంది. ఈ భవనంలో 30 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది దాకా వైద్యులు, కరోనా వారియర్స్ ఉన్నారు. ఇలాంటి భవనంలో ఉన్నట్టుండి... దట్టమైన పొగలు వచ్చాయి. ఆ తర్వాత మంటలూ వచ్చాయి. అసలే కరోనా సోకిన వారికి ఊపిరి సరిగా ఆడదు. దానికి తోడు పొగ కూడా యాడ్ అవ్వడంతో... రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఊపిరాడని బాధితులు కిటికీల దగ్గరకు వచ్చి కేకలు వేశారు. తీవ్ర ఆందోళన చెందారు. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతూ... దాదాపు భవనాన్ని చుట్టుముట్టాయి.


    విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. భారీ ఆపరేషన్ నిర్వహించి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. మొత్తం ఆరు ఫైర్ ఇంజిన్లను ఉపయోగించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఐతే... అప్పటికే... చాలా వరకూ పొగ ఆస్పత్రి అంతటా వ్యాపించింది. కొందరు బాధితులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు రోగుల పేరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్వర్ణప్యాలెస్‌ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేషెంట్ల తరలింపు కొనసాగుతోంది.



    కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు అనుకుంటున్నారు. పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Vijayawada Fire Accident, Ys jagan

    తదుపరి వార్తలు