ఆగని అమరావతి ఉద్యమం.. కీలక దశకు చేరుకున్న పోరాటం..

Amaravati : ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతుల ఆందోళన కీలక దశకు చేరుకుంది. ఈ రోజుతో ఉద్యమం 100 రోజులను పూర్తి చేసుకుంది.

news18-telugu
Updated: March 26, 2020, 12:40 PM IST
ఆగని అమరావతి ఉద్యమం.. కీలక దశకు చేరుకున్న పోరాటం..
అమరావతి ఆందోళనలు (File)
  • Share this:
Amaravati : ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతుల ఆందోళన కీలక దశకు చేరుకుంది. ఈ రోజుతో ఉద్యమం 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తుళ్లూరు వద్ద శిబిరంలో ధర్నా చేస్తున్న అమరావతి రైతులు.. ఉద్యమంలో మృతి చెందిన రైతులు, రైతు కూలీలకు నివాళి అర్పించారు. రాజధానిని వేరే ప్రాంతానికి తరలించవద్దని, అమరావతిలోనే కొనసాగించాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. కాగా, ఈ వంద రోజుల్లో రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు వంటావార్పు, 72 గంటల దీక్షలు, 168 గంటల దీక్షలు, జలదీక్షలు, సర్వమత ప్రార్ధనలు, మోకాళ్లపై నిలబడి వేడుకోలు ఇలా అనేక రూపాల్లో నిరసన కొనసాగించారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading