హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ట్రాక్టర్ల ర్యాలీ తీసిన మరో వైసీపీ మరో ఎమ్మెల్యే...

ట్రాక్టర్ల ర్యాలీ తీసిన మరో వైసీపీ మరో ఎమ్మెల్యే...

సూళ్లూరుపేట ఎమ్మెల్యే ట్రాక్టర్ల ర్యాలీ (Image;Twitter)

సూళ్లూరుపేట ఎమ్మెల్యే ట్రాక్టర్ల ర్యాలీ (Image;Twitter)

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సుమారు 10 - 12 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి విమర్శల పాలయ్యారు. అయితే, ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి వివాదంలోకి ఎంటరయ్యారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సుమారు 10 - 12 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసర సరుకులు అందించేందుకు ఆయన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బుధవారం రోజు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించినట్టు వెలుగులోకి వచ్చింది. తన నియోజకవర్గంలోని 59 గ్రామాల్లోని ప్రజలకు ఈ సరుకులు పంచేందుకు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారని తెలిసింది. జగన్ అన్న కానుక పేరుతో తన నియోజకవర్గంలో రూ.2 కోట్ల విలువైన నిత్యావసరాలను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే భావించారు.

వైసీపీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. ఆ బ్యానర్ల మీద సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు కూడా ఉంచారు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు, మరికొందరు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సామాజిక దూరం పాటించలేదని స్థానికులు చెబుతున్నారు. సామాన్యుల మీద ఉక్కుపాదం మోపే పోలీసులు ఎమ్మెల్యేను కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, Lockdown, Nellore Dist

ఉత్తమ కథలు