చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం.. సెల్ఫీ వీడియో తీసి మరొకరు మృతి

ఆస్పత్రిలో కరోనా రోగులను పట్టించుకునే వారే లేరంటూ సయ్యద్ (38) అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీశాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నా చికిత్స అందించలేదని.. అసలు తన వార్డులో వైద్య సిబ్బంది ఎవరూ లేరని వీడియో తీసి.. మరణించాడు.

news18-telugu
Updated: June 29, 2020, 11:17 PM IST
చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం.. సెల్ఫీ వీడియో తీసి మరొకరు మృతి
సెల్ఫీ వీడియో తీసిన సయ్యద్
  • Share this:
తెలంగాణలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. గాంధీ ఆస్పత్రిలో జర్నలిస్ట్ మనోజ్ మృతి నుంచి నిన్న చెస్ట్ ఆస్పత్రిలో రవికుమార్ అనే యువకుడి మరణం వరకు ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు ఎవరూ పట్టించుకోవడం లేదని.. ప్రాణాలు పోతున్నా కనీసం చికిత్స అందించడం లేదని వీడియోలు తీస్తున్నారు. తాజాగా చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో కరోనా రోగులను పట్టించుకునే వారే లేరంటూ సయ్యద్ (38) అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీశాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నా చికిత్స అందించలేదని.. అసలు తన వార్డులో వైద్య సిబ్బంది ఎవరూ లేరని వీడియో తీసి.. మరణించాడు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది.


అంతేకాదు సయ్యద్‌ ఉదయం మరణించినప్పటికీ.. ఇప్పటివరకు వరకు అతని మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సయ్యద్ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఇటీవల రవికుమార్ అనే యువకుడు కూడా సెల్ఫీ వీడియో తీసి చనిపోయిన విషయం తెలిసిందే. జవహర్‌నగర్‌కు చెందిన ఆ యువకుడు.. తనకు ఊపిరాడడం లేదని చెప్పినా వెంటిలేటర్ తొలగించారని సంచలన ఆరోపణలు చేశాడు. ఊపిరాడడం లేదు డాడీ. ఇక్కడ అడ్మిట్ చేయవద్దని చెప్పినా నువ్వు వినలేదు. గుండె ఆగిపోతోంది. బై..డాడీ అంటూ చెప్పి కన్నుమూశాడు. అది జరిగిన 48 గంటల్లోనే మరో యువకుడు అదే విధంగా కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న వైద్యంపై మరోసారి దుమారం రేగుతోంది.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,582 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 253 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,559 యాక్టివ్ కేసులున్నాయి
First published: June 29, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading