Andhra Pradesh: మొన్న కర్నూలు.. నేడు గుంటూరు.. చంద్రబాబును వెంటాడుతున్న కేసులు

Andhra Pradesh: మొన్న కర్నూలు.. నేడు గుంటూరు.. చంద్రబాబును వెంటాడుతున్న కేసులు

చంద్రబాబును వెంటాడుతున్న కేసులు

చంద్రబాబు నాయుడుని కేసులు వెంటాడుతున్నాయి. కర్నూలులో ఎన్ 440 పుట్టి.. అన్ని జిల్లాలకు కరోనా విస్తరించిందని.. అది భయంకరమైన వైరస్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. తాజాగా గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Share this:
    టీడీపీ అధినేత చంద్రాబాబును కేలులు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ వెంటాడుతోంది. అయితే అలా ఏపీని వెంటాడుతున్న వైరస్ అతి భయంకరమైంది అని చెప్పిన కారణంగా చంద్రాబును ఇప్పుడు కేసులు వదల బొమ్మాళి అంటున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో చంద్రాబుపై  నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు.. ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చే విషయంలో కర్నూలు పోలీసులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా గుంటూరులో మరో కేసు నమోదైంది..

    టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ కేసులు వదిలే లేవు. తాజాగా గుంటూరులో మరో కేసు నమోదైంది. న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని పచ్చల అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా భయంతో చాలామంది మరణిస్తున్నారని.. ఇలాంటి సమయంలో ప్రజలను భయపెట్టే వ్యాఖ్యలు చేయడంతో అందరిలో మరిన్ని అనుమానాలు పెరిగాయి అంటూ న్యాయవాది అనిల్ ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఫిర్యాదు ఆధారంగా 188, 505(1)బి, 505(2) సెక్షన్ల కింద పోలీసులు చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు.

    అంతకుముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా విషయంలో ప్రజల భయాందోళనకు గురి చేశారంటూ కర్నూలుకు చెందిన సుబ్బయ్య అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఎన్‌440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు భయపెట్టారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబుపై ఐపీసీ 155,505/1/బి/2, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు.

    అయితే ఈ కేసులపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అంటున్నారు. ప్రభుత్వానికి చేత కాకే ఇలా అక్రమ  కేసులు పెట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. చంద్రాబాబుపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు చేసినా.. ఏవీ రుజువు కాకపోవడంతో ఇలా కరోనా పేరు చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలే ఇలా వెనకాల ఉండి కేసులు పెట్టిస్తున్నారని.. తరువాత అరెస్టులు చేయాలని పోలీసులకు డైరక్షన్లు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులకు టీడీపీ భయపడదని.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటామంటున్నారు టీడీపీ నేతలు.

    మరోవైపు ఏపీ పోలీసులు ఈ కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కర్నూల్లోనమోదైన నాన్ బెయిల్ బుల్ కేసుల ఆధారంగా నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ విషయంలో పోలీసులు ఇప్పటికే వెనుకడుగు వేశారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. త్వరలోనే చంద్రబాబుకు నోటీసులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు