Corona Medicine: కరోనాకు కాక్‌ టెయిల్‌ ఇంజక్షన్‌తో బ్రేక్.. 24 గంటల్లోనే ఫలితం

కరోనా రోగుల పాలిట సంజీవిని మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్

కరోనా రోగుల పాలిట సంజీవిని గా నిలుస్తోంది మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్.. ఇంజెక్షన్ తీసుకున్న 24 గంటల్లోనే ఫలితం వస్తోందని వైద్యులు ధైర్యంగా చెబుతున్నారు..

 • Share this:
  అన్నా రఘు, న్యూస్ 18 ప్రతినిధి, గుంటూరు

  కరోనా బాధితులకు గుడ్ న్యూస్.. అసలు కరోనాకు మందే లేదు అనుకుంటున్న సమయంలో కరోనాను భయపెట్టే సరికొత్త మందు మార్కెట్ లోకి వచ్చింది.  ప్రస్తుతం అది కరోనా రోగుల పాలిట సంజీవనిగా పని చేస్తోంది.  మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టైల్ డ్ర గ్.. ప్రస్తుతం కరోనా రోగులకు రక్షణ కవచంగా మారింది అంటున్నారు వైద్యులు.  "మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్ టైల్ డ్రగ్" గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కరోనా వైరస్ సోకిన సమయంలో.. అక్కడి అమెరికన్ మిలటరీ హాస్పిటల్ ల్లో ఆయనకు ఈ ఇంజెక్షన్ ను వినియోగించింది.  కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే రెండు రకాల డ్రగ్ మిశ్రమంతో తయారుచేసిన యాంటీబాడీ కాక్ టైల్ ఇంజక్షన్ తో చికిత్స చేశారు.

  ఈ మిశ్రమ డ్రగ్ ఔషధం ఇటీవలి కాలంలో భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ డ్రగ్ పనితీరు ఎలా ఉంది. ఇది ఎవరికి వాడొచ్చు.. ఏ పరిస్థితిలో వాడవచ్చు అనే విషయం పై నరసరావుపేట లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కారసాని.శ్రీనివాసరెడ్డి వివరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లో యాంటీబాడీ కాక్ టైల్ వినియోగించి ఇద్దరికి కోవిడ్ వైద్యం అందించినట్లు మహాత్మ గాంధీ సూపర్ స్పెషాలిటీ యం.డి ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్  రెడ్డి తెలిపారు.

  ఇదీ చదవండి: వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూర్ వెళ్లాలా..? ఏపీ మెడికల్ హబ్ అవుతుందన్న సీఎం జగన్

  తమ ఆస్పత్రిలో ఇద్దరు కోవిడ్ రోగులకు యాంటీబాడి కాక్ టైల్ డ్రగ్ వాడిన తరువాత.. వారిలో కోవిడ్ లక్షణాలు తగ్గి సాధారణ స్థితికి చేరుకున్నారని వివరించారు. ఈ డ్రగ్ వైరస్ మ్యుటేషన్లను,స్పైక్ ప్రొటీన్ ని అంటి పెట్టుకుని అవి మానవకణాలలోకి వెళ్ళకుండా విజయవంతంగా ఎదుర్కోవడంలో  కాక్ టైల్ యాంటీబాడీ పనిచేస్తాయని వివరించారు. ఐతే ఈ డ్రగ్ ను వ్యాధి సోకిన 5 రోజులలోపు ఇవ్వడం వలన మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వ్యాధి తీవ్రత పెరిగిన వారిపై పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చునని ఆయన తెలిపారు..

  ఇదీ చదవండి: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌... CCRAS నివేదికలో ఏముందంటే?

  ఇప్పటి వరకు కోవిడ్ చికిత్స కోసం వాడుతున్న వివిధ రకాల ఔషధాలతో పోల్చినప్పుడు ఈ మందు 70% మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ ఔషధంతో  0.6% లేదా అంతకంటే తక్కువ స్థాయిలోనే తీవ్రమైన దుష్ప్రవాలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ  ఔషధాన్ని సిప్లా ఫార్మా తయారు చేస్రుతోంది.  దాదాపు ఆరువేల రూపాయలకు రెండు డోసులు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. సరైన విధంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశరాలను పరిశుభ్రంగా ఉండటంవలన 70% కోవిడ్ బారినపడకుండా ఉండవచ్చునని తెలిపారు.
  Published by:Nagesh Paina
  First published: