గద్వాల జిల్లాలో కుక్కలకూ కరోనావైరస్ పరీక్షలు..

గద్వాల జిల్లాలో కుక్కలకూ కరోనావైరస్ పరీక్షలు..

ప్రతీకాత్మక చిత్రం

గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. రెండు రోజులుగా ఇక్కడ కొత్త కేసులు నమోదు కావడం లేదు.

 • Share this:
  జంతువులకూ క‌రోనా టెస్టులు తప్పడం లేదు. కుక్కలకు కరోనా వైరస్‌ సోకిందని స్థానికులు కంప్లైంట్ చేయ‌డంతో అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో కోవిడ్-19 సోకిందని స్థానికులు అనుమానించారు. గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుేకెళ్లారు. దీంతో పశుసంవర్ధ శాఖకు చెందిన మెడిక‌ల్ టీమ్ గ్రామానికి చేరుకొని.. కుక్కల నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిర్వ‌హించారు. అనంతరం వాటికి కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

  గ్రామ సమీపంలోని కోళ్ల వ్యర్థాలను తిని కుక్కలు వింతగా ప్ర‌వ‌ర్తిస్తున్నాయని.. అంతేగానీ వాటికి కరోనా వైరస్ సోకలేదని డాక్టర్ రాజేశ్ వెల్ల‌డించారు. వాటికి రోగ నిరోధక టీకాలు వేశామని ఆయన పేర్కొన్నారు . అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని ఓ జూలో కొన్ని పులులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నగరంలో రెండు పెంపుడు పిల్లులకు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. కాగా, గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. ఐతే రెండు రోజులుగా ఇక్కడ కొత్త కేసులు నమోదు కావడం లేదు.

  మరోవైపు తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల చాలా తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. మంగళవారం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 374 మంది కోలుకోగా.. 25 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 610 యాక్టివ్ కేసులున్నాయి. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే చెప్పారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు