హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Virus: యూకే వైరస్ ఏపీకి వచ్చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలో గుర్తింపు

UK Virus: యూకే వైరస్ ఏపీకి వచ్చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలో గుర్తింపు

ఈ ఫంగస్ మనిషి శరరీంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని.. దీనికి ఎలాంటి విరుగుడు ఉండకపోవచ్చని అన్నారు.

ఈ ఫంగస్ మనిషి శరరీంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని.. దీనికి ఎలాంటి విరుగుడు ఉండకపోవచ్చని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న యూకేలోని కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమిషనర్ ధ్రువీకరించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

  ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న యూకేలోని కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమిషనర్ ధ్రువీకరించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల ఓ మహిళ యూకే నుంచి భారత్ వచ్చింది. ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే, అక్కడి నుంచి ఆమె తప్పించుకుని రైల్లో రాజమండ్రి వెళ్లింది. చివరకు ఆమెను కనుగొన్న అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ మహిళకు యూకేలో ఉన్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉన్నట్టు గుర్తించారు. ‘ఇటీవల యూకే నుంచి వచ్చి ఢిల్లీలో ఐసోలేషన్ కేంద్రం నుంచి తప్పించుకుని ప్రత్యేక రైల్లో రాజమండ్రికి చేరుకున్న ఆంగ్లో ఇండియన్ మహిళకు యూకే కరోనా స్ట్రెయిన్ ఉంది. అయితే, ఆమె నుంచి ఎవరికీ సోకలేదు.’ అని ఏపీ హెల్త్ కమిషనర్ చెప్పినట్టు ఏఎన్ఐ తెలిపింది.

  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ డిసెంబర్ 28న ప్రారంభమైంది. డ్రై రన్ విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ కృష్ణా జిల్లాలో ఐదు ఆసుపత్రులను కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ కేంద్రాలుగా ఎంపిక చేశారు. వాటిలో పోలింగ్‌ కేంద్రం లాగానే ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క సెంటర్‌కు ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లను నియమించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, విజయవాడ ప్రకాష్‌నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌, కంకిపాడు మండల పరిధిలోని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్‌ ఇని స్టిట్యూట్‌, పెనమలూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాడిగడప సచివాలయం-4లోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఈ కరోనా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ నిర్వహించారు.

  కరోనా వైరస్ (Coronavirus) తగ్గుముఖం పడుతున్న సమయంలో యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అయితే, కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం (Oxford University), ఆస్ట్రాజెనెకా(AstraZeneca) సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. దీని అన్ని టెస్టింగులు విజయవంతం కావడంతో ఇది కేవలం కరోనా వైరస్‌కే కాకుండా తాజాగా యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ కట్టడికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని యూకేలో ఒక ప్రముఖ మీడియా రిపోర్ట్ తెలిపింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India )తో ఒప్పందం కుదుర్చుకున్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ముందు యూకేలో ఆమోదం పొందే అవకాశం ఉంది. దీన్ని ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు ఇప్పటికే కరోనాతో ఆసుపత్రిలో చేరిన 12 నుంచి 15 మిలియన్ల మందికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. COVID–19 న్యూ స్ట్రెయిన్ పాత వైరస్ను అధిగమించిందని, ఇది UKలో ప్రబలంగా వ్యాపిస్తుందని, దీని వ్యాప్తి వేగం 70 శాతం ఎక్కువగా ఉంటుందని నివేదిక హెచ్చరించింది. దీంతో బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) త్వరలోనే దీన్ని అందుబాటులోకి తేవడానికి ఆమోదముద్ర వేసింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Corona virus, UK Virus

  ఉత్తమ కథలు