ఏపీలో మీరు కరోనా టెస్టు చేయించుకోవాలంటే.. ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

కరోనా పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు

news18-telugu
Updated: July 12, 2020, 10:19 PM IST
ఏపీలో మీరు కరోనా టెస్టు చేయించుకోవాలంటే.. ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా? మీకు కరోనా సోకినట్టు అనుమానంగా ఉందా? కరోనా లక్షణాలు ఉన్నాయా? కరోనా పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. కరోనా టెస్టులు చేయించుకోవడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల్లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వీలైనంత మందికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కూడా రైల్వే స్టేషన్లు, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా కరోనా టెస్టులు చేస్తోంది. ఇంకా చాలా మంది తాము కరోనా టెస్టు చేయించుకోవాలని భావిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లాలనే సందేహం ఉంది. అలాంటి వారి సందేహాలకు సమాధానంగా కోవిడ్ 19 స్వాబ్ కలెక్షన్ వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.


ఇందులో మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, వయసు, అడ్రస్ ఇవ్వాలి. అలాగే, మీకు ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయా? లేకపోతే అసలు ఎలాంటి లక్షణాలు లేవా? అనే వివరాలు కూడా టిక్ చేయాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ వివరాలు అందులో వస్తాయి. మీకు నచ్చిన లొకేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి అదనపు వివరాలు కావాలంటే.. 9963112781 ఫోన్ నెంబర్‌లో సంప్రదింవచ్చు.

corona drug, corona vaccine, unlock2, lockdown6, extend the lockdown, corona update, fight with corona virus, covid19, కరోనా డ్రగ్, కరోనా మందు, కరోనా వ్యాక్సిన్, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, అన్‌లాక్2,
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇంటికే కరోనా క్వారంటైన్ కిట్...


ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు 1,933 పాజిటివ్‌‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,914 కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 18, ఇతర దేశాల నుంచి వచ్చి వారిలో ఒకరికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి పెరిగింది. ప్రస్తుతం 13,428 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉండగా, 15,412 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 19 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, అనంతపురంలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు కరోనా వల్ల చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 17,624 కరోనా పరీక్షలు నిర్వహించారు. నేటి వరకు రాష్ట్రంలో 11,53,849 శాంపిల్స్ పరీక్షించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 12, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading