ఏపీలో కరోనా సునామీ.. జూలైలో 865 శాతం పెరిగిన కేసులు.. దేశంలోనే టాప్..

ఆంధ్రప్రదేశ్‌లో జూలై నెల రోజుల్లో కరోనా కేసులు 865 శాతం పెరిగాయి.

news18-telugu
Updated: August 1, 2020, 5:48 PM IST
ఏపీలో కరోనా సునామీ.. జూలైలో 865 శాతం పెరిగిన కేసులు.. దేశంలోనే టాప్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సునామీ సృష్టిస్తోంది. రాష్ట్రంలో జూలై నెలలోనే 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే నెల రోజుల్లో కరోనా కేసులు 865 శాతం పెరిగాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు ఈ స్థాయిలో పెరగలేదు. జూన్ 30వ తేదీన ఏపీలో కరోనా కేసుల సంఖ్య 14,596. జూలై 31 వచ్చేసరికి ఆ సంఖ్య 1,40,933కి పెరిగింది. అంటే నెల రోజుల్లో 1.26 లక్షల కేసులు వచ్చాయి. అందులో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచే భయంకరంగా కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలోనే 1800 శాతం కరోనా కేసులు పెరిగాయి. కరోనా టెస్టుల్లో పాజిటివ్ శాతాన్ని పరిశీలిస్తే జూలైలో అది 11.9 శాతం ఉంది. ఓవరాల్‌గా చూస్తే పాజిటివ్ రేటు 7.22 శాతంగా ఉంది. ఏపీలో జూలై 31న ప్రభుత్వం జారీ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం 10,376 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 1349 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పేషెంట్ల రికవరీ రేట్ 45.3 శాతంగా ఉంది.

కరోనా వైరస్ కేసుల్లో దేశంలోనే మూడో స్థానానికి చేరింది ఆంధ్రప్రదేశ్. దేశ రాజధాని ఢిల్లీని మించిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే ఏపీలో 30,636 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడులో ఉన్నాయి. మూడో స్థానంలో ఢిల్లీ ఉండగా, దాన్ని వెనక్కి నెట్టి ఏపీ మూడో స్థానానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం ఏపీలో జూలై 31 వరకు 19,51,776 కరోనా టెస్టులు చేశారు. సగటున ప్రతి 10 లక్షల మందికి 36,550 పరీక్షలు చేసినట్టు లెక్క. రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీ ఎత్తున చేయడం వల్లే కరోనా కేసులు బయటపడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 1, 2020, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading