మహిళ అంతిమయాత్రకు భారీగా జనం... కరోనా పాజిటివ్ అని తెలియగానే పరార్...

ఇందులో... ఆ వెళ్లిపోయిన వాళ్లను తప్పు పట్టలేం. ఎందుకంటే... కరోనా సమస్య అంతలా ఉంది. ఎక్కడ తమకు సోకుతుందో అని ప్రజలు భయపడుతున్నారు.

news18-telugu
Updated: June 27, 2020, 1:50 PM IST
మహిళ అంతిమయాత్రకు భారీగా జనం... కరోనా పాజిటివ్ అని తెలియగానే పరార్...
మహిళ అంతిమయాత్రకు భారీగా జనం... కరోనా పాజిటివ్ అని తెలియగానే పరార్... (credit - twitter)
  • Share this:
ఎవరైనా సరే... తాము చనిపోయాక... తమ అంతిమ యాత్రలో వీలైనంత ఎక్కువ మంది పాల్గొనాలని కోరుకుంటారు. కానీ దురదృష్టం కొద్దీ ఈ కరోనా వచ్చిన తర్వాత... అంతిమయాత్ర కాదు... అసలు అంత్యక్రియలు చేసేందుకే అయినవారు ముందుకు రాని సందర్భాలు చాలా ఉంటున్నాయి. అదే సమయంలో... తమ వాళ్లకు తామే అంత్యక్రియలు జరుపుతామని ప్రభుత్వాధికారులతో గొడవకు దిగేవారూ ఉన్నారు. ఇది మరోరకమైన ఘటన. శ్రీకాకుళం జిల్లాలోని అదో పల్లెటూరు. అక్కడ 65 ఏళ్ల ఓ పెద్దామె గురువారం రాత్రి చనిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్గోయ అధికారులు వెంటనే ప్రభుత్వ రూల్స్ ప్రకారం... ఆమె నుంచి కరోనా శాంపిల్స్ సేకరించారు.

శుక్రవారం తెల్లారిన తర్వాత స్థానిక ప్రజలు, బంధువులూ... తలో చెయ్యీ వేసి... అంతిమ యాత్రలో నడుస్తూ బయల్దేరారు. ఇంతలో... ఎవరో పరుగెడుతూ వచ్చి... మరో వ్యక్తికి చెవిలో... ఏదో చెప్పాడు. అతను మరొకరికి చెప్పాడు. అలా... అందరూ చెప్పుకొని... ఎవరికి వాళ్లు తలో దారీ చూసుకున్నారు. మధ్యలోనే మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. మృతదేహం దగ్గర ఆమె కొడుకు, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు.

మేటరేంటంటే... ఆమె కరోనా పాజిటివ్‌తో చనిపోయినట్లు రిపోర్ట్ రావడమే. ఆమె ద్వారా తమకు ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో... అందరూ వెళ్లిపోయారు. చివరకు పాడె ఎత్తేవాళ్లు కూడా లేని పరిస్థితి తలెత్తింది. ఈ విషయం తెలిసిన అధికారులు పరుగున వచ్చారు. అంత్యక్రియలకు సాయం రమ్మని స్థానికుల్ని అడిగారు. కానీ స్థానికులు క్షమించమని కోరారు. తాము రాలేమన్నారు. తమకు కరోనా సోకితే, దిక్కూ మొక్కూ ఉండదనీ... తమ కుటంబాలు రోడ్డున పడతాయని వారంతా తమ తమ బాధలు చెప్పుకున్నారు. దాంతో అధికారులకు కూడా వాళ్లను రమ్మని గట్టిగా అడిగే పరిస్థితి లేకుండా పోయింది.

ఇలాంటి సమయంలో అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. కానీ... ఉన్న రెండూ... ఇద్దరు కరోనా పాజిటివ్ పేషెంట్లను తీసుకెళ్లే పనిలో ఉన్నాయి. దాంతో అంతిమయాత్ర ఎలా పూర్తవుతుందా, ఎలా అంత్యక్రియలు జరపాలా అని ఆలోచిస్తున్న అధికారులు... పక్క గ్రామానికి వెళ్లి... ఓ శానిటరీ వర్కర్‌ (పారిశుధ్య కార్మికుడు)కు విషయం చెప్పారు. అతను పరిస్థితి అర్థం చేసుకొని అధికారులతో వెళ్తుంటే... స్థానికులు అడ్డుకున్నారు. అలా వెళ్తే... తిరిగి గ్రామంలో అడుగు పెట్టనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. దాంతో అధికారులు వాళ్లందర్నీ బతిమలాడారు. అతనికి ఎలాంటి వైరస్సూ సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటామని వేడుకున్నారు. అలాగే... అతని కుటుంబ సభ్యులకు 14 రోజులు క్వారంటైన్ సదుపాయం కల్పించి... అన్ని రకాల నిత్యవసరాలూ అతని ఇంటికే పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు పంచాయతీ ఆఫీస్ కూడా గ్యారెంటీ ఇవ్వడంతో... అప్పుడు స్థానికులు సరే అన్నారు.

ఆ తర్వాత మరో సమస్య...

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పంచాయతీ ట్రక్ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ దాని డ్రైవర్ కుదరదన్నాడు. అతను కాంట్రాక్ విధానంలో... పంచాయతీ సేవకుడిగా పనిచేస్తున్నాడు. అధికారులు... అతని కుటుంబ సభ్యుల్ని వేడుకున్నారు. దాంతో కుటుంబ సభ్యులు... సరే వెళ్లి అన్ని జాగ్రత్తలూ తీసుకో అని అతనికి చెప్పారు. ఆ తర్వాత అధికారులు... 65 కేజీల ఆ ముసలామె మృతదేహాన్ని ఓ PPE కిట్‌లో ప్యాక్ చేసి... ట్రక్కులో ఎక్కించారు. ఆమెతోపాటూ... ఆమె కొడుకు, పారిశుధ్య కార్మికుడు వెంట వెళ్లారు. ఇదీ కరోనాతో వస్తున్న సమస్య. ఎవరి బాధ వారిది. మానవ సంబంధాల్నీ, అనుబంధాలనీ ఈ కరోనా గొయ్యి తియ్యకుండానే పాతిపెట్టేస్తోంది.
First published: June 27, 2020, 1:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading