Andhra Pradesh: దమ్ముంటే ఇక్కడికి రా.. ఎంపీ రామ్మోహన్ నాయుడికి 'చిరంజీవి' సవాల్

ఎంపీ రామ్మోహన్ నాయుడికి స్పీకర్ తమ్మినేని కొడుకు ఛాలెంజ్

ఏపీలో కరోనా తీవ్రతపై టీడీపీ తీవ్ర ఆందోళన చెందుతోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కరోనా విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలో ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో చిరంజీవి స్పందించి ఎంపీ రామ్మోహన్ నాయుడుకు సవాల్ విసిరారు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు అన్నారు.

  • Share this:
    ఏపీలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన పెంచుతున్నాయి. గత 24 గంటల్లో కేసులు కాస్త తగ్గినట్టు కనిపించినా.. ఒక్కరోజు లోనే వందమందికిపై కరోనా కారణంగా మరణించడం తీవ్రంగా కలవర పెడుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. అసలు కరోనా లక్షణాలు ఉండి.. పరీక్షలు చేయించుకోని వారే ఎక్కువమంది ఉంటున్నారు. చివరికి వారి పరిస్థితి సీరియస్ అయితే తప్ప కరోనా ఉంది అన్న సంగతి తెలియడం లేదు.. గుర్తించే సరికి ఆలస్యమవుతోంది. దీంతో అత్యవసర సమయానికి ఆక్సిజన్ బెడ్ దొరకకపోవడమో.. సమయానికి చికిత్స అందకపోవడంతోనో మరణాలు పెరుగుతున్నాయి.. ఏపీ వ్యాప్తంగా వైద్య సదుపాయల కొరతపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరా సమయానికి అందడం లేదని.. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని ఆరోపిస్తున్నాయి.. ఇతర రాష్ట్రాలకు కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ లాంటి కఠిన చర్యలు తీసుకుంటే.. ఏపీ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని విపక్షాలు రోజూ విమర్శిస్తూనే ఉన్నాయి.

    ఏపీలో కరోనా పరిస్థితి.. అలాగే తన సొంత జిల్లాలోనూ పరిస్థితులపై టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు కరనో కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మెరుగైన వైద్యు సదుపాయాలు అందిస్తున్నాయని.. కానీ ఏపీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు మాత్రం రాజకీయాలు గురించి ఆలోచిస్తున్నారు తప్పా.. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు భారీగా వ్యాక్సిన్ ను తెప్పించుకుంటున్నాయని ఏపీ ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ డోస్ లు ఎందుకు పెంచడం లేదని కేంద్రాన్ని అడగలేకపోతోందని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతలు ఏం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..

    ఇదీ చదవండి: బాబోయ్ బ్లాక్ ఫంగస్.. ఏపీలో 10పైనే బాధితులు.. ఎలా గుర్తించాలి? చికిత్స ఉందా?

    ఎంపీ రామ్మోహన్ నాయుడి విమర్శలపై తమ్మినేని సీతారాం కుమారుడు.. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ మండిపడ్డారు. వ్యాక్సిన్, కరోనా చికిత్స గురించి ఎంపీ రామ్మోహన్ నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చురకలు అంటించారు. దేశంలో ఏ రాష్ట్రం బయటి దేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవడం లేదని..అలాంటి పరిస్థితులు ఉంటే నిరూపించాలని రామ్మోహన్ నాయకుడికి సవాల్ విసురుతున్నానని పేర్కొన్నారు. మీ నాయకుడు చంద్రబాబు.. హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్ లో మాట్లాడతారని.. మీరు సోషల్ మీడియాలో మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూర్చుని ఫేస్ బుక్ లో మాట్లాడటం కాదని.. దమ్ముంటే శ్రీకాకుళం రా అంటూ చిరంజీవి నాగ్ సవాల్ విసిరారు. పీపీఈ కిట్లు వేసుకుని రిమ్స్ హాస్పిటల్ కు వెళదామని.. వైద్యం సక్రమంగా అందుతుందో లేదో చూద్దామని ఫైర్ అయ్యారు. వైద్యం సక్రమంగా అందుతుంటే మీరు చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకుంటారా ? అని ప్రశ్నించారు..
    Published by:Nagesh Paina
    First published: