Home /News /coronavirus-latest-news /

AP Schools Re-open: ఏపీలో స్కూళ్లు తెరుచుకునేది ఎప్పుడు..? 16న అనుకుంటే ఊహించని ట్విస్ట్

AP Schools Re-open: ఏపీలో స్కూళ్లు తెరుచుకునేది ఎప్పుడు..? 16న అనుకుంటే ఊహించని ట్విస్ట్

స్కూల్స్ రీ ఓపెనింగ్ పై అనుమానాలు

స్కూల్స్ రీ ఓపెనింగ్ పై అనుమానాలు

ఏపీలో గుడి గంటలు మోగుతున్నాయి.. మరి బడి గంటల మాటేంటి..? ఈ నెల 16వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నా.. ఇప్పుడు మరో ట్విస్ట్ ఎదురైంది..

    ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో ఈ నెల 16 ను ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం పదే పదే చెబతూ వస్తోంది. అందుకే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ నెల 16 తరువాత స్కూళ్లు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్న కరోనా.. థర్డ్ వేవ్ హెచ్చరికలు.. ఇంకా పూర్తి కాని వ్యాక్సినేషన్ ఈ నేపథ్యంలో పఠశాలలు తెరవడం ఎంత వరకు సరైన నిర్ణయం అని ప్రశ్నలు వినిపిస్తున్నారు. ఇప్పటికే పిల్లలు క్లాస్ రూమ్ మరచిపోయి 500 రోజులు దాటింది. భుజాన బ్యాగేసుకుని స్కూల్‌కి ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇంట్లో పిల్లల అల్లరి భరించలేకున్నా ఇప్పట్లో పంపించ లేమని కొందరు తల్లిదండ్రులు అంటే.. ఇంకా ఎంత కాలం ఇలా క్లాస్ లు లేకుండా స్కూళ్లు తెరవాలని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ తెరిచినప్పటికీ విద్యార్థులు కరోనా బారిన పడడంతో మిగతా రాష్ట్రాలు ఆలోచనలో పడుతున్నాయి. అసలే కరోనా థర్డ్ వేవ్ అంచనాలు.. ఈ క్రమంలో స్కూల్ గేట్లు ఓపెన్ అవుతాయా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. విద్యా సంస్థలు తెరవడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చినప్పటికీ విద్యాశాఖ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి.

    ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఈ నెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే రోజు రోజుకూ స్కూళ్లను త్వరగా తెరవాలి అని వాధించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కొ్న్ని జాగ్రత్తల మధ్య పాఠశాలలను తెరవడమే మంచిదంటున్నారు. ముఖ్యంగా తొమ్మిది, పది తరగతి పిల్లల తల్లిదండ్రుల్లో ఎక్కువమంది స్కూళ్లు తెరవాలనే కోరుకుంటున్నారు. లేదంటే ఈ ఏడాది కూడా వారి చదవు అటకెక్కేస్తుందని ఆందోళన చెందుతున్నారు..

    కొంతమంది తల్లిదండ్రులు మాత్రం.. హైస్కూల్ వరకు ప్రత్యక్ష తరగతులు పెట్టి.. మిగిలిన వారికి ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇలా భిన్న వాధనలు వినిపిస్తున్న సమయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకనే స్కూల్స్ తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. టీచర్లకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కాకుండా పాఠశాలలు ఎలా తెరుస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులకు 85% వ్యాక్సినేషన్ పూర్తి చేశామని కోర్టుకు తెలిపింది. మిగతా వారికి కూడా త్వరితగతిన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాదు ఆఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో కేసు విచారణను ఈ నెల 18కి హైకోర్టు వాయిదా వేసింది. మరి అప్పటి వరకు స్కూళ్లు తెరవకపోవడమే మంచిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Schools, Corona alert

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు