ఏపీలో ప్రతి పావుగంటకు ఒకరు మృతి.. రికార్డు స్థాయిలో కరోనా మరణాలు...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య 2వేలు దాటింది.

news18-telugu
Updated: August 9, 2020, 7:47 PM IST
ఏపీలో ప్రతి పావుగంటకు ఒకరు మృతి.. రికార్డు స్థాయిలో కరోనా మరణాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య 2వేలు దాటింది. గత 24 గంటల్లో ఏపీలో 97 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో చనిపోయిన వారి సంఖ్య 2036కి పెరిగింది. ఏపీలో గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 12, ప్రకాశం 11, చిత్తూరు 10, పశ్చిమగోదావరి 10, అనంతపురం 8, కడప 8, శ్రీకాకుళం 8, కర్నూలు 7, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 6, కృష్ణా 4, నెల్లూరు 4, విజయనగరంలో ముగ్గురు చనిపోయారు. ఇక కరోనా కేసుల విషయానికి వస్తే గత 24 గంటల్లో అత్యధికంగా 10,820 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,860కి చేరింది. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1543మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు 1399, పశ్చిమ గోదావరి 1132, విశాఖపట్నం 961, గుంటూరు 881, అనంతపురం 858, చిత్తూరు 848, కడప 823, నెల్లూరు 696, శ్రీకాకుళం 452, కృష్ణా 439, ప్రకాశం 430, విజయనగరం 358 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 62912 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 24,87,305కి చేరింది. గత 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి కోలుకుని 9097 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 87112 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 138712 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 9, 2020, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading