ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీ సంఖ్య..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఈ రోజు కూడా కొంచెం తగ్గింది.

news18-telugu
Updated: August 15, 2020, 5:59 PM IST
ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీ సంఖ్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఈ రోజు కూడా కొంచెం తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8732 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,82,817కి పెరిగింది. అలాగే, రాష్ట్రంలో గత 24 గంటల్లో 87 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2562కి చేరింది. ఏపీలో 24 గంటల వ్యవధిలో చిత్తూరులో 10, గుంటూరు 9, తూర్పుగోదావరి 8, పశ్చిమ గోదావరి 8, అనంతపూర్ 7, కడప 7, కర్నూలు 7, నెల్లూరు 6, విశాఖపట్నం 6, విజయనగరం 6, ప్రకాశం 5, శ్రీకాకుళం 5, కృష్ణాలో ముగ్గురు చనిపోయారు. అలాగే, ఏపీలో 24 గంటల వ్యవధిలో తూర్పుగోదావరిలో 1126, చిత్తూరు 959, విశాఖపట్నం 894, అనంతపురం 851, కర్నూలు 734, శ్రీకాకుళం 638, పశ్చిమ గోదావరి 612, గుంటూరు 609, నెల్లూరు 572, విజయనగరం 561, ప్రకాశం 489, కడప 389, కృష్ణా 298 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 53712 కరోనా టెస్టులు నిర్వహించారు. 10,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 28,12,197 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 88138 యాక్టివ్ కేసులు ఉండగా, 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 15, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading