ఏపీలో కొంచెం తగ్గిన కరోనా కేసులు... ఈ రెండు జిల్లాల్లో భారీగా నమోదు..

ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో 8555 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: August 2, 2020, 7:16 PM IST
ఏపీలో కొంచెం తగ్గిన కరోనా కేసులు... ఈ రెండు జిల్లాల్లో భారీగా నమోదు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8555 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,58,764 కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో ఏపీలో 67 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1474కి పెరిగింది. ఏపీలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 1227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 996, తూర్పుగోదావరి జిల్లాలో 930 కేసులు వచ్చాయి. చిత్తూరు 781, అనంతపురంలో 696, గుంటూరు 639, విజయనగరం 637, పశ్చిమ గోదావరి 550, శ్రీకాకుళం 492, నెల్లూరు 448, కడప 396, ప్రకాశం 384, కృష్ణా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కృష్ణాలో 11, గుంటూరు 8, తూర్పుగోదావరి 7, విశాఖపట్నం 7, కర్నూలు 6, నెల్లూరు 6, శ్రీకాకుళం 5, ప్రకాశం 4, చిత్తూరు 3, కడప 3, విజయనగరం 3, అనంతపురం 2, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున మరణించారు. ఏపీలో గత 24 గంటల్లో 52834 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,65,407 టెస్టులు చేశారు. వారిలో 1,58,764 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో 82,886 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 74404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1474 మంది కరోనాతో చనిపోయారు. అటు కరోనా పాజిటివ్ కేసులు, కరోనా టెస్టుల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. కరోనా కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఏపీలో అత్యధిక కరోనా కేసులు ఉన్నాయి. ఇక కరోనా టెస్టుల్లో తమిళనాడు ముందు వరుసగా ఉండగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2020, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading