AP Corona Cases: ఏపీకి భారీ ఊరట, తగ్గిన కరోనా కేసులు, మరణాలు

24 గంటల్లో ఏపీలో 7738 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనా వైరస్ బారిన పడి మృతిచెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

news18-telugu
Updated: September 20, 2020, 6:01 PM IST
AP Corona Cases: ఏపీకి భారీ ఊరట, తగ్గిన కరోనా కేసులు, మరణాలు
ఏపీలో కరోనా కేసులు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. 24 గంటల్లో ఏపీలో 7738 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 625514కి చేరింది. అలాగే, 24 గంటల్లో ఏపీలో 57 మంది కరోనా వైరస్ బారిన పడి మృతిచెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణాలో 8, అనంతపూర్ 7, చిత్తూరు 7, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, కడప 3, శ్రీకాకుళం 3, పశ్చిమ గోదావరి 3, గుంటూరు 2, నెల్లూరు 2, విజయనగరంలో ఇద్దరు కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5359కి పెరిగింది. 24 గంటల్లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1260 మంది కరోనా బారినపడ్డారు. పశ్చిమగోదావరిలో 1005, ప్రకాశం 869, చిత్తూరు 794, గుంటూరు 582, అనంతపూర్ 539, శ్రీకాకుళం 476, విజయనగరం 446, నెల్లూరు 444, కృష్ణా 439, విశాఖపట్నం 342, కర్నూలు 275, కడప 267 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 625514కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 78836 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 541319 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక రోజులో 10,608 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 24 గంటల్లో 70455 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, మొత్తం 51,04,131 కరోనా శాంపిల్స్ టెస్టు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading