తూర్పుగోదావరిపై కరోనా సునామీ.. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన జిల్లాలివే..

Andhra Pradesh Covid Data | గడిచిన 24 గంటల్లో ఏపీలో 42 మంది కరోనా వల్ల చనిపోయారు.

news18-telugu
Updated: July 17, 2020, 2:26 PM IST
తూర్పుగోదావరిపై కరోనా సునామీ.. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన జిల్లాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఏపీలో ఉన్న వారికి 2592, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరిలో కరోనా సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో అత్యధికంగా 24 గంటల్లోనే 634 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత గుంటూరులో 367, చిత్తూరు 328, కర్నూలు 315 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 297, శ్రీకాకుళం 149, నెల్లూరు 127, పశ్చిమ గోదావరి 109, విజయనగరం 89, కడప 55, ప్రకాశం 53, కృష్ణా 37, విశాఖపట్నం జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 42 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, ప్రకాశం 5, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, కడప 3, విశాఖపట్నం 3, కర్నూలు 2, నెల్లూరు 2, విజయనగరం 2, కృష్ణాలో ఒకరు కరోనా వల్ల మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 20,245 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 12,60,512 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో 19,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 16,584 మంది ఆస్పత్రుల్లో, 3230 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. 20,298 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 534 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో తెలంగాణ నుంచి వచ్చిన ఆరుగురు, కర్ణాటక నుంచి వచ్చిన ఇద్దరికి తాజాగా కరోనా నిర్ధారణ అయింది. కువైట్ నుంచి వచ్చి ఓ వ్యక్తికి, దక్షిణ కొరియా నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చింది.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 2461 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 2105 మంది కోలుకున్నారు. 356 మందిమాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 381 మంది కోలుకున్నారు. 53 మంది చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలో ఎలాంటి కోవిడ్ మరణాలు నమోదు కాలేదు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 17, 2020, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading