ఏపీ కరోనా కేసుల్లో రికార్డు బ్రేక్... ఈ మూడు జిల్లాల్లో భయంకరం...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10328 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: August 6, 2020, 7:25 PM IST
ఏపీ కరోనా కేసుల్లో రికార్డు బ్రేక్... ఈ మూడు జిల్లాల్లో భయంకరం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10328 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,96,789కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో 72 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1753కి చేరింది. కరోనా వల్ల అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 10, గుంటూరులో 9, చిత్తూరులో 8, కృష్ణాలో 6, నెల్లూరు 6, ప్రకాశం 6, విశాఖపట్నం 4, కడప 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 3, కర్నూలు 2, శ్రీకాకుళంలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1351 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలులో 1285, అనంతపురంలో 1112 కేసులు నమోదయ్యాయి. గుంటూరు 868, పశ్చిమ గోదావరి 798, నెల్లూరు 788, విశాఖపట్నం 781, చిత్తూరు 755, శ్రీకాకుళం 682, కడప 604, ప్రకాశం 366, కృష్ణా 363 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 63,686 కరోనా టెస్టులు చేశారు. దీంతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,99,332 కరోనా టెస్టులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 112870 కాగా, ప్రస్తుతం 82166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 6, 2020, 7:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading