ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు.. మరణాల్లో కూడా రికార్డు..

ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,557కి చేరింది.

news18-telugu
Updated: July 30, 2020, 6:31 PM IST
ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు.. మరణాల్లో కూడా రికార్డు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరణాల సంఖ్య మళ్లీ 10వేల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,167 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,30,557కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68గా ఉంది. దీంతో కలిపి మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1281కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 9, అనంతపురంలో 8, కర్నూలు 8, విశాఖపట్నంలో 8, చిత్తూరులో 6, కడపలో 6, ప్రకాశం 4, విజయనగరంలో 4, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు కరోనాతో మరణించారు.

ఏపీలోని మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1441, కర్నూలులో 1252, విశాఖపట్నంలో 1223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరిలో 998, అనంతపురంలో 954, గుంటూరులో 946, కడపలో 753, నెల్లూరులో 702, శ్రీకాకుళంలో 586, చిత్తూరులో 509, ప్రకాశంలో 318, కృష్ణాలో 271, విజయనగరంలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 70,068 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,90,077 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 60,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వకు 1281 మంది కరోనాతో కన్నుమూశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 30, 2020, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading