అత్యవసరమైన పనుల కోసం ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలనుకునేవారు పోలీస్ పాస్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఇ-పాస్‌కు దరఖాస్తు చేయొచ్చని తెలిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. అయితే డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అత్యవసర పరిస్థితులపై ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఎమర్జెన్సీ ట్రావెల్ పాస్‌లను జారీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. జిల్లా పరిధిలో వెళ్లాలంటే జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేయాలి. జిల్లా దాటి వెళ్లాలంటే తమ జిల్లా ఎస్పీ ద్వారా వెళ్లాలనుకున్న జిల్లా ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఎస్పీ ద్వారా డీఐజీ ఆఫీసుకి అప్లై చేయాలి. పోలీసులు దరఖాస్తుదారుల వివరాలన్నీ పరిశీలించి సరైన కారణాలు ఉంటే ఇ-పాస్ మంజూరు చేస్తారు. మరి ఏ జిల్లాలో ఎవరికి దరఖాస్తు చేయాలో తెలుసుకునేందుకు ఈ టేబుల్ చూడండి.
యూనిట్ పేరు | వాట్సప్ నెంబర్ | ఇమెయిల్ ఐడీ |
శ్రీకాకుళం | 6309990933 | dail100srikakulam@gmail.com |
విజయనగరం | 9989207326 | spofvzm@gmail.com |
విశాఖపట్నం రూరల్ | 9440904229 | vizagsp@gmail.com |
విశాఖపట్నం సిటీ | 9493336633 | cpvspc@gmail.com |
తూర్పు గోదావరి (కాకినాడ) | 9494933233 | sp@eg.appolice.gov.in |
రాజమండ్రి అర్బన్ | 9490760794 | sp@rjyu.appolice.gov.in |
పశ్చిమ గోదావరి | 8332959175 | policecontrolroomeluruwg@gmail.com |
కృష్ణా (మచిలీపట్నం) | 9182990135 | sp@kri.appolice.gov.in |
విజయవాడ సిటీ | 7328909090 | cp@vza.appolice.gov.in |
గుంటూరు రూరల్ | 9440796184 | Dail100gunturrural@gmail.com |
గుంటూరు అర్బన్ | 8688831568 | guntururbansp@gmail.com |
ప్రకాశం | 9121102109 | spongole@gmail.com |
నెల్లూరు | 9440796383 | nelloresp@gmail.com |
చిత్తూరు | 9440900005 | spchittoor@gmail.com |
తిరుపతి అర్బన్ | 9491074537 | sptpturban@gmail.com |
అనంతపురం | 9989819191 | spatp1@gmail.com |
కడప | 9121100531 | spkadapa2014@gmail.com |
కర్నూల్ | 7777877722 | spkurnool.kur@gmail.com |
అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునేవారు పాస్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్, వాహనం నెంబర్, అడ్రస్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు అన్న వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. పైన వెల్లడించిన వాట్సప్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి అప్లై చేయాలి. పోలీసులు దరఖాస్తులను పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారుల మొబైల్ నెంబర్లకే ఇ-పాస్‌లను పంపిస్తారు. తనిఖీల సమయంలో ఇ-పాస్ చూపించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
మీ అకౌంట్లోకి రూ.1500 రాలేదా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి
SBI account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ లాభాలు
LIC Policy Loan: ఎల్ఐసీ పాలసీ ఉందా? లోన్ తీసుకోవచ్చు ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.