ఏపీలో రెడ్ జోన్‌గా ఆ రెండు మండలాలు.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..

గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, క్రోసూరు మండలాలను రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరు బయట తిరుగుతున్నారు? వారు ఎవరెవర్ని కలిశారు? తదితర వివరాలు సేకరిస్తున్నారు.

news18-telugu
Updated: April 2, 2020, 10:29 AM IST
ఏపీలో రెడ్ జోన్‌గా ఆ రెండు మండలాలు.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..
దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు.
  • Share this:
ఒక్కసారిగా కరోనా కేసులు ఏకధాటిగా పెరగడం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన 711 మందితో పాటు.. ఎంతమందికి వైరస్ సోకిందో తెలుసుకునే పనిలో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే 111 మందికి కరోనా పాజిటివ్ రావడంతో జగన్ సర్కారు చర్యలను ముమ్మరం చేసింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, క్రోసూరు మండలాలను రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరు బయట తిరుగుతున్నారు? వారు ఎవరెవర్ని కలిశారు? తదితర వివరాలు సేకరిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల 20 కుటుంబాలను వైద్యపరీక్షల కోసం కాటూరి ఆస్పత్రికి తరలిస్తున్నారు.

అటు.. ప్రజలు బయటికి రావొద్దని, బయటి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు దాటివ వారెవరూ బయటకు రావద్దని సూచించారు. ఈ ఏరియాల్లో శానిటైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
First published: April 2, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading