Home /News /coronavirus-latest-news /

ANDHRA PRADESH MINSTER CLARITY ON AP SCHOOL HOLIDAYS AND ONLINE CLASSES WHAT HE SAID NGS

AP Schools: పాఠశాలలకు సెలవులు పొడింగింపు.. ఆన్ లైన్ క్లాసులపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ.. ఏమన్నారంటే?

స్కూల్స్ పై మంత్రి క్లారిటీ

స్కూల్స్ పై మంత్రి క్లారిటీ

AP Schools Holidays: ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల రీ ఓపెనింగ్ పై గందరగోళం కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి సెలవుల తరువాత ఇవాళ రీఓపెన్ అయినా చాలామంది విద్యార్థులు స్కూళ్లకు హాజరు కాలేదు.. అయితే దీనిపై ముందురోజే మంత్రి క్లారిటీ ఇచ్చినా విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానాలు తొలగలేదు. చాలామంది సెలవులు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై మంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు..

ఇంకా చదవండి ...
  Minster Adimulapu Suresh on School Holidays:  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  లో కరోనా  వైరస్ (Corona Virus) వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇప్పటికే చేయిదాటినట్టు కనిపిస్తోంది. ఇక సంక్రాంతి (Sankranti) సెలవుల నుంచి అందరు తిరిగి పట్టణాలకు చేరుకుంటుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. అయితే ఈ ప్రభావం స్కూళ్లపై అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి సెలవుల తర్వాత ఏపీలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షం టీడీపీతో పాటు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు (Parents) సైతం సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ వేగంగా విరుచుకుపడుతోంది. ఇలాంటి పాఠశాలలు తెరవడం చాలా ప్రమాదకరమైన హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. స్కూల్స్ (Schools) కు సెలవులు పొడిగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్  (Minster Adimulapu Suresh) స్పందించారు. ఆన్ లైన్ క్లాస్ (Online Classes) ల నిర్వహణపై ఆయన క్లారిటీ ఇచ్చారు..

  విద్యార్ధుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సురేష్.. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందని వివరించారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అనుసరించామని, దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఈ దృష్ట్యా పాఠశాలలు తిరిగి ప్రారంభించినట్లు వివరించారు. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు కూడా కొవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కొవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే బోధన జరుగుతోందన్నారు. 150 రోజులు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని వెల్లడించారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నట్లు వివరించారు. అసలు కొవిడ్ వ్యాప్తికి పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదన్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి : ఆ మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు కరోనా.. రేపటి పరీక్షలపై అనుమానం

  విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సురేస్.. కరోనా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అయితే ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవడం లేదని కొందరు ప్రస్తావిస్తే.. పొరుగు రాష్ట్రాలతో పోలిక అవసరం లేదన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే స్కూళ్లను ఆగస్టులోనే ప్రారంభించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఆన్ లైన్ క్లాస్ లు ప్రత్యామ్నాయం కాదన్నారు.  ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహిస్తున్నామని ఆదిమూలపు స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి : నారా లోకేష్ కు కరోనా పాజిటివ్.. రాజకీయ నేతలపై వైరస్ దాడి

  ఇక ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. అమెరికాలో లక్షలాది కేసులు వస్తున్నప్పటికీ విద్యాసంస్థలను మూసివేయలేదు.. మనకు ఎందుకు భయం అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి. అమెరికాలోనూ ఏపీలోనూ పరిస్థితి ఒకటేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అక్కడ వైద్యు సదుపాయాలు.. విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందో మంత్రికి తెలుసా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap minister suresh, Corona alert, Corona casess

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు