Andhra Pradesh Jobs: కరోనా వైరస్ ఆస్పత్రుల్లో 146 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లోని కరోనా వైరస్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ జరుగుతోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 29, 2020, 10:15 AM IST
Andhra Pradesh Jobs: కరోనా వైరస్ ఆస్పత్రుల్లో 146 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Andhra Pradesh Jobs: కరోనా వైరస్ ఆస్పత్రుల్లో 146 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్‌తో పోరాటానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా కోవిడ్ 19 ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ప్రాంతాల్లో ఈ ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, కుప్పంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ జరుగుతోంది. మొత్తం 146 ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాంట్రాక్ట్ పోస్టులు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు కోరారు. అభ్యర్థులు మే 5 లోగా దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు- 146

స్వీపర్- 68
ఎఫ్ఎన్ఓ- 42
ఎంఎన్ఓ- 36
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 5
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలివయస్సు- 42 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీలకు 45 ఏళ్లు.
వేతనం- రూ.12,000
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

మహర్షి అభ్యుదయ సేవా సంస్థ, డోర్‌ నెం.19-45-514-631,
పద్మావతి పార్కు ఎదుట,
బైరాగిపట్టెడ, తిరుపతి.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 0877-2220578

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

BECIL Jobs: మొత్తం 51 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు

ISRO Jobs: ఇస్రోలో జాబ్స్... మే 1 చివరి తేదీ

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
First published: April 29, 2020, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading