Home /News /coronavirus-latest-news /

ANDHRA PRADESH HIGH COURT ON ANDHAYYA MEDICINE ISSUE NOTICES TO CENTRAL GOVERNMENT NGS

Anandayya: ఆనందయ్య మందుపై కోర్టు కీలక ఆదేశాలు.. కేంద్ర మంత్రికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్

ఆనందయ్య మందుపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆనందయ్య మందుపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆనందయ్య మందు ఆయుర్వేదమా..? కాదా..? ఆయన తయారు చేస్తున్న మందుతో కరోనా తగ్గుతుందా..? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరినీ వెంటాడుతున్న ప్రశ్నలు ఇవే.. ఇలాంటి సమయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..

    ఒకప్పుడు నెల్లూరుకే పరిమితమైన ఆనందయ్య కరోనా మందు.. తరువాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆనందయ్య మందు ఆయుర్వేదమా కాదా అన్నదానిపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఆ మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని ఆయూష్ అధికారులు చెప్పడంతో.. ప్రజలకు ఇంకా మందుపై నమ్మకం పెరిగింది. ఆనందయ్య మందుకు అనుమతి ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం.. ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

    మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఆనందయ్య తన మందును ప్రభుత్వం గుర్తించాలని పిటిషన్ వేశారని కూడా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో తెలియ జేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవని.. లిఖిత పూర్వకంగా ఇది ఇంకా స్పష్టం కాలేదని కూడా హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.

    ఇదీ చదవండి: పండగ చేసుకుంటున్న టీడీపీ నేతలు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

    మరోవైపు దీనిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఆనందయ్య ఔషధంపై జరుగుతున్న అధ్యయనం వివరాలను ఆయన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవను అడిగి తెలుసుకున్నారు. తొలుత కిరణ్ రిజిజుకు ఫోన్ చేసిన ఆయన... వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తిచేయాలని సూచించారు. అందుకు కిరణ్ రిజిజు బదులిస్తూ... మంత్రాలయంలోని ఆయుష్ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని వెంకయ్యనాయుడికి తెలిపారు.

    ఇదీ చదవండి: కరోనా నుంచి కాపాడే మొక్కలు.. మాస్కు వాడరు.. వైరస్ లేదు.. రాలేదు..

    ఆనందయ్య మందు వాడిన 500 మంది నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ అధ్యయనంలో వినియోగిస్తున్నారని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం కావడంతో, లోతైన అధ్యయనం జరుగుతోందని, దేనిపైనా రాజీపడకుండా వెళుతున్నందున కొంత సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు. ఆపై వెంకయ్యనాయుడు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవకు ఫోన్ చేశారు. ఆనందయ్య మందు ఐసీఎంఆర్ పరిధిలోకి రాదని, ఆయుష్ శాఖకు సంబంధించిన అంశం అని బలరాం భార్గవ ఉపరాష్ట్రపతికి వివరించారు. ఇప్పటికే ఆయుష్ శాఖ అధ్యయనం చేస్తున్నందున, ప్రత్యేకంగా ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేయాల్సినంత ఆవశ్యకత లేదని తెలిపారు.

    ఇదీ చదవండి: క్షణ క్షణం భయం భయం... నిద్రలేని రాత్రులు ఎన్నో.. ఈ మహానగరానికి ఏమైంది..?

    మరోవైపు ఆనందయ్య మందును తీసుకున్న 500 మందితో జాబితా రూపొందించిన అధికారులు, ఆ జాబితాలో ఉన్నవారికి ఫోన్ చేశారు. అయితే, కొందరు స్పందించకపోగా, మరికొందరు తాము ఆ మందు తీసుకోలేదని చెప్పడంతో అధికారులు తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా ఆనందయ్య మందు వేసుకున్నామని కొందరు, కరోనా సోకిన తర్వాతే వేసుకున్నామని కొందరు చెబుతున్నట్టు వెల్లడైంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, AP News, Ayurveda health tips, Ayushman Bharat Health Scheme, Venkaiah Naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు