హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid19 Vaccine: టీకా వేయించుకున్న మహిళకు అస్వస్థత.., ఆందోళనకు తెరదించిన డాక్టర్లు

Covid19 Vaccine: టీకా వేయించుకున్న మహిళకు అస్వస్థత.., ఆందోళనకు తెరదించిన డాక్టర్లు

కరోనా టీకా వేయించుకున్నమహిళకు అస్వస్థత.,డీ హైడ్రేషన్ గా తేల్చిన వైద్యులు

కరోనా టీకా వేయించుకున్నమహిళకు అస్వస్థత.,డీ హైడ్రేషన్ గా తేల్చిన వైద్యులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్న మహిళ అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పరాణికి వ్యాక్సిన్ వేయడాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో హెల్త్ వర్కర్లకు టీకాలు వేస్తున్నారు. కాగా విజయవాడలోని జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న ఓ నర్సు అస్వస్థతకు గురైంది. వ్యాక్సిన్ వేసిన వెంటనే హెల్త్‌ వర్కర్‌ రాధ కళ్లు తిరిగిపడిపోయింది. దీంతో అప్రమత్తమైన డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై డాక్టర్లు ఇంతవరకు స్పదించలేదు.

అసలు కారణం ఇదే..!

ఐతే  నర్సు అస్వస్థకు గురికావడానికి కారణం టీకా కాదని ప్రాధమికంగా నిర్ధారించారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా టీకా తీసుకోవడం,  ఒకింత ఆందోళన వల్లే ఆమె కళ్లుతిరిగిపడిపోయినట్లు తెలుస్తోంది. రాధ అస్వస్థతకు గురైన వెంటనే అప్రమత్తమైన వైద్యులు ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. టీకా ప్రభావాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని.., దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశమే లేదని తెలిపారు.

వ్యాక్సిన్ వేయించుకునేవారికి ముఖ్య సూచనలు:

వ్యాక్సిన్ వేయించుకునే వారు మనసులో ఎలాంటి ఆందోళన పెట్టుకోకూడదని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించుకునే ముందు ఏదైనా తినాలి అనే నిబంధన లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఐతే సరిగా తినకపోవడం, టీకా వేయించునే సమయంలో ఆందోళనకు గురికావడం వల్లే నీరసించి కళ్లు తిరిగిపడిపోతారు. ఇదివరకు కరోనా వ్యాక్సిన్ వేసుకొని అలర్టీల వంటివి వచ్చిన వారు ఇప్పుడు వేసుకోకూడదు. గర్భిణీలు, ఈమధ్యే పిల్లల్ని కన్న తల్లులు, గర్భం ఉందో, లేదో తెలియని మహిళలు ఈసారికి టీకా వేయించుకోకూడదు. ఇదివరకు కరోనా సోకిన వారు లేదా కరోనా పాజిటివ్‌గా తేలిన వారు ఈసారి వ్యాక్సిన్ వేయించుకోవాలి. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, HIV పేషెంట్లు, రకరకాల కారణాలతో వ్యాధినిరోధక శక్తి కోల్పోతున్నవారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కొంత మందికి రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అలాంటివారు, కోగులోపతి సమస్య ఉన్నవారు, రక్తకణాల సమస్యలతో బాధపడేవారు వ్యాక్సిన్ తీసుకునే ముందు ప్రత్యేత జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు, అంతకు మించిన వయసు ఉన్నవారికి మాత్రమే ఎమర్జెన్సీ వాడకం కింద ఇస్తున్నారు. రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ 14 రోజులు తప్పక ఉండాలి. మొదటి డోస్ ఏది వేసుకుంటే, రెండో డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు యాక్టివ్‌గా ఉన్నవారు, ఆల్రెడీ యాంటీబాడీస్ పొందినవారు, ప్లాస్మా పొందినవారు, ఇతరత్రా అనారోగ్యాల వల్ల తీవ్రమైన సమస్యతో ఆస్పత్రిపాలైన వారు... ఈ సమస్యల నుంచి బయటపడిన తర్వాత... కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుండా 4 నుంచి 8 వారాలు ఉండాలి.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్

రాష్ట్ర వ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు. మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలయింది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలన జరగనుంది. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అధికారులు పర్యవేక్షించనున్నారు. నిరంతర ప్రక్రియకు కేంద్రం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసింది.

First published:

Tags: Andhra Pradesh, Corona, Corona Vaccine, Covaxin, Covid-19, COVID-19 vaccine, Covishield, Vijayawada

ఉత్తమ కథలు