హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Cases in AP : ఏపీలో కరోనాపై ప్రభుత్వం కీలక నిర్ణయం... ఆరు జిల్లాల్లో హై అలర్ట్..

Corona Cases in AP : ఏపీలో కరోనాపై ప్రభుత్వం కీలక నిర్ణయం... ఆరు జిల్లాల్లో హై అలర్ట్..

ఏపీ మంత్రి  ఆళ్ల నాని

ఏపీ మంత్రి ఆళ్ల నాని

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇటీవలి కాలంలో కరోనా కేసులు (Corona Virus) పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చూస్తుండగానే రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలు దాటుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కృష్ణ జిల్లా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..న్ని జాగ్రత్తలు తీసుకోవాలని అదేశాలిచ్చారు. కరోనా నివారణకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. రానున్న ఆరు వారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం... ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని.. తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. గతంలో పోలిస్తే వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున నిర్లక్ష్యానికి తావులేకుండా ఉండాలన్నారు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిద్ధమైందని.. అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించాయన. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 150, భీమవరం ట్విట్ కోలో 500 బెడ్లు, తాడేపల్లిగుడెం ట్విట్ కో లో 1000 బెడ్లు, ఏలూరు CRR ఇంజనీరింగ్ కాలేజీ లో 200 బెడ్స్, ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ లో 400 బెడ్స్, తాడేపల్లి గూడం, పాలకొల్లు, బీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్కో చోట 30 బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

ఇది చదవండి: ఏపీలో మరోసారి లాక్ డౌన్..? ముఖ్యంగా ఆ నాలుగు జిల్లాల్లో హై అలర్ట్..


కాగా రాష్ట్రంలో తాజాగా 35,732 ని పరీక్షించగా 4,157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 297, చిత్తూరు జిల్లాలో 571,తూర్పుగోదావరి జిల్లాలో 617, గుంటూరు జిల్లాలో 434, కడప జిల్లాలో 112, కృష్ణాజిల్లాలో 135, కర్నూలు జిల్లాలో 386, నెల్లూరు జిల్లాలో 276, ప్రకాశం జిల్లాలో 230, శ్రీకాకుళం జిల్లాలో 522, విశాఖపట్నం జిల్లాలో 417, విజయనగరం జిల్లాలో 154, పశ్చిమగోదావరి జిల్లాలో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,419 కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,01,327 మంది డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం 1,606 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,383కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,339కి చేరింది.  కరోనా బాధితులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది.

First published:

Tags: Alla Nani, Andhra Pradesh, Corona virus

ఉత్తమ కథలు