news18-telugu
Updated: August 6, 2020, 10:41 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా అన్ లాక్ ప్రక్రియ నిబంధనలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఆగస్టు 31 వరకూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతి ఉండబోదని ఉత్తర్వులు జారీఅయ్యాయి. దీంతో పాటు సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవరాదని ఆదేశించింది. అలాగే యోగా శిక్షణా కేంద్రాలతో పాటు జిమ్ లలో భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ నిబంధనలు పాటిస్తూ, కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది.
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించుకోవాలని సూచించింది. ఇక కంటెయిన్ మెంట్ జోన్లు అమలవుతున్న ప్రాంతాల్లో నెలాఖరు వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని, ఇక్కడ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది.
Published by:
Krishna Adithya
First published:
August 6, 2020, 10:41 AM IST