Corona Effect | రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్...

కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

news18-telugu
Updated: March 18, 2020, 5:38 PM IST
Corona Effect | రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్...
దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు.
  • Share this:
కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదై ఉంది. ఇప్పటి వరకు అదనంగా ఎలాంటి కేసు కొత్తగా నమోదు కాలేదు. కరోనా పాజిటివ్ వ్యక్తికి చికిత్సకొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా ప్రబల కుండా ఇప్పటికే గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఏపీలో విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే, ఎప్పటి వరకు అనే విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు. అయితే, పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.



కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.  ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మార్చి 31 వరకు సెలవులను ప్రకటించారు. పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక కర్ణాటక, తమిళనాడులో కూడా గట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
First published: March 18, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading