Corona Alert: ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా.. గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్ కు పాజిటివ్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (ఫైల్)
Corona Alert: ఆంధ్రప్రదేశ్ కరోనా ముప్పు తొలిగిపోయిందని అందరూ ఊరట పొందుతున్న సమయంలో.. ఈ వార్త షాక్ అనే చెప్పాలి.. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఇంతలోనూ ఊహించని వార్త వినాల్సి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది..
AP Govrner Biswabhusan Harichandan reported Positive: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ను కరోనా వైరస్ (Corona Virus) భూతం భయం ఇంకా వీడ లేదా.. అయితే గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు (Corona Cases) చూస్తే భారీగా తగ్గుతున్నాయి. కేవలం వంద, రెండు వదందల లోపే కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. చాలా జిల్లాల్లో పది లోపే కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా కేసులు తగ్గాయని ఊరట చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని వార్త షాక్ ఇస్తోంది. మళ్లీ కరోనా విస్తరిస్తుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్(AP Govrner Biswabhusan Harichandan) కు కరోనా పాజిటివ్(Corona Positive) ఉన్నట్లు వెద్యులు వెల్లడించారు. గవర్నర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం గవర్నర్ హరిచందన్ ఆరోగ్యం స్థిరంగా ఉందని.. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామన.. త్వరలో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఇటీవల గర్నవర్ ను కలిసిన వారందర్నీ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. అలాగే సిబ్బందిలో ఎవరికైనా కరోనా సోకిందా అని పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం..
ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు. ఈరోజు ఉదయం అస్వస్ధతకు గురైన బిశ్వ భూషణ్ హారిచందన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చి గవర్నర్ ఆరోగ్య పరిస్ధితిని గురించి ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను అడిగి తమిళి సై వివరాలు తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతోందని… బిశ్వ భూషణ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా అని తమిళిసై అన్నారు.
ఉదయం తీవ్ర ఆనారోగ్యానికి గురికావడంతో అధికారులు వెంటనే ఆయన్ను విజయవాడ (Vijayawada) నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ (Hyderabad) కు తరలించారు. మొదటిగా కరోనా లక్షాలు కాస్త కనిపించడంతో వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ ఉందని తేలింది.
మరోవైపు గవర్నర్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల బృందం గవర్నర్ కు చికిత్స అందిస్తోంది. కరోనా దృష్ట్యా కొంతకాలంగా గవర్నర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల కాస్త అస్వస్థతకు గురైనా ఆ తర్వాత కోలుకున్నారు. అయినా ఆయనను కరోనా వెంటాండింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.