Andhra Pradesh: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం... కరోనాతో విచ్చిన్నమైన కుటుంబాలకు చేయూత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కష్ట కాలంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రక్కసి కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి వారిని ఆదుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

  • Share this:
    ఏపీలో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తొలి దశతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ లో కరోనా మరణాలు భారీగా పెరిగాయి. మరోవైపు కుటుంబాలపై కరోనా కన్ను పడింది. ఒక్కరి మరణంతో సరిపెట్టుకోని కరోనా భూతం ఒకే ఇంటిలో ముగ్గురు నలుగుర్ని తనకు తోడుగా తీసుకెళ్తోంది. చాలా జిల్లాల్లో ఒక్కో కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు మరణిస్తున్నారు. తాజాగా గుంటూరులో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం కలచి వేస్తోంది. పలు గ్రామాలు, పట్టణాల్లో తల్లి దండ్రులు మరణించిన ఘటనలు ఉన్నాయి. కుటుంబ పెద్ద మరణంతో.. చాలామంది పిల్లలు అనాథలుగా మారుతున్నారు. కరోనా భయంతో వారిపైపు చూసేందుకు కూడా బంధువులు, సన్నిహితులు ఇష్టడడం లేదు. దీంతో చాలామంది చిన్నారు ఏపీలో కరోనా కాటు కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు..

    కేవలం మరణించిన వారే కాదు.. కరోనాకు అమ్మానాన్న ఇద్దరికీ కరోనా సోకితే.. ఆ పిల్లల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారుతోంది. చుట్టు పక్కల జనం ఉన్నా.. బంధువులు భారీగా ఉన్నా.. కరోనా భయం కారణంగా వారిని అక్కున చేర్చుకోలేకపోతున్నారు. దీంతో తల్లితండ్రి ఎప్పుడు వస్తారో తెలిదు.. సాయం కోసం ఎవరిని అడగాలో తెలియన పరిస్థిల్లో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహమ్మారి దెబ్బకు సాయం చేసేవాళ్లు కరవవుతున్నారు.. ముక్కుపచ్చలారని పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

    తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలు కోసం.. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల పిల్లలు కోసం.. ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకు.. చికిత్స పొందుతున్న పిల్లలకు సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు అధికారులు.

    ఈ నిర్ణయంతో పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉంటారని, ఐసోలేషన్‌లో ఉన్న తల్లిదండ్రులకు కూడా పిల్లలకు ఏం అవుతుందో అనే బాధ ఉండదని అధికారులు చెబుతున్నారు. చుట్టు పక్కల పిల్లలు అనాథలుగా మారుతున్నా.. వారిని పట్టించుకున్న వారు కనిపించడం లేదు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా వెలుగులోకి తీసుకొస్తే.. అక్కడక్కడ మానవత్వం ఉన్న మనుషులు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చిన్నారుల బాధలను వారికి తెలియ చేసేవారు కూడా లేరు. కానీ ఇకపై అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలవడం నిజంగా అభినందించాల్సిన అంశం..
    Published by:Nagesh Paina
    First published: