Andhra Pradesh: రాష్ట్రానికి ఊపిరి పోసే నిర్ణయం.. భారీగా నిధులు కేటాయించిన ఏపీ సీఎం జగన్

Andhra Pradesh: రాష్ట్రానికి ఊపిరి పోసే నిర్ణయం.. భారీగా నిధులు కేటాయించిన ఏపీ సీఎం జగన్

ఏపీ వ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలపై సీఎం జగన్ ఫోకస్

కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం జగన్ ఊపిరి పోసే వార్త చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ అందక ఏపీ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరిగింది. దీంతో ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ల కోసం భారీగా నిధులు కేటాయించారు సీఎం జగన్.

  • Share this:
    ఆక్సిజన్ ఇప్పుడు ఏ నోటీ విన్నా అదే మాట.. ఏపీ వ్యాప్తంగా సామాన్యుడి నుంచి డబ్బు ఉన్న ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట పదే పదే వినిపిస్తోంది. ఇటు మంత్రులకు, వీఐపీలకు ఫోన్లు వచ్చినా.. అందులో ఆక్సిజన్ గురించే సగానికి పైగా కాల్స్ ఉంటున్నాయి. అంతలా ఏపీలో ఇప్పుడు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. అందుకు ముఖ్యంగా రాష్ట్రంపై కరోనా పంజా విసరడమే కారణం. తొలి వేవ్ తో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ ఏపీపై సునామీలా విరుచుకుపడుతోంది. ఎవ్వరనీ వదలడం లేదు. మంత్రులు, ప్రజా ప్రతినిధలు, అధికారులు, చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా అందరిపై పడగ విప్పుతోంది.

    ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఓ వైపు 22 వేలకు పైగా కేసులు నమోదైంది. వరుసగా రెండో రోజు 90కి పైగా మరణాలు నమోదు అయ్యాయి.  ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడాలేదు. ఆఖరికి గిరిజన గ్రామాలు, మారుమూల పల్లెటూర్లను కూడా కరోనా వదలడం లేదు. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఏపీలో కరోనా మరణాలు ఎక్కువ పెరగడానికి ఆక్సిజన్ సమయానికి అందకపోవడమే.. చాలామంది కరోనా రోగులు చివరి వరకు సమస్యను గుర్తించ లేకపోతున్నారు. గుర్తించే సమయానికి వారికి అందుబాటులో ఆక్సిజన్ ఉండడం లేదు. దీంతో అక్సిజ‌న్ అంద‌క‌ ఎంద‌రో అమ‌యాకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేప‌థంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వైద్యానికి ఆక్సిజన్‌ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

    ఇదీ చదవండి:  టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉగ్రవాద లక్షణాలు... వైసీపీ మంత్రుల కౌంటర్ ఎటాక్

    ఏపీలో ఆక్సిజన్ అవసరం ఉందని గుర్తించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లకు భారీగా నిధులు కేటాయించారు సీఎం జగన్. ఈ మేర‌కు వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్సిజన్ త‌యారి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం .309.87 కోట్ల రూపాయ‌లు కేటాయించింది.

    ఇదీ చదవండి: కర్ఫ్యూతో కంట్రోల్ కాని కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు.. భయం భయం

    రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటుగా, 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇక మ‌రో ప‌ది వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే ఆరు నెలలకు 60 లక్ష రూపాయ‌లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై కరికాల వలవన్‌ దృష్టిసారించనున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు.
    Published by:Nagesh Paina
    First published: