హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఏపీలో 365కు చేరిన కరోనా కేసులు.. తాజా బులిటెన్ విడుదల..

ఏపీలో 365కు చేరిన కరోనా కేసులు.. తాజా బులిటెన్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CovidUpdates : ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 12 గంటల్లో అనంతపురంలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.

CovidUpdates : ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 12 గంటల్లో అనంతపురంలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 892 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 365 కేసులు నమోదు కాగా, 10 మంది డిశ్చార్జి అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా 349 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే అనంతపూర్‌లో 15, చిత్తూరులో 20, తూర్పు గోదావరిలో 12, గుంటూరులో 51, కడపలో 29, కృష్ణాలో 35, కర్నూలులో 75, నెల్లూరులో 48, ప్రకాశంలో 38, శ్రీకాకుళంలో సున్నా, విశాఖపట్నంలో 20, విజయనగరంలో సున్నా, పశ్చిమ గోదావరిలో 22 కేసులు నమోదయ్యాయి.

తాజా మెడికల్ బులెటిన్

First published:

Tags: Anantapur S01p19, AP News, Corona, Coronavirus, Covid-19

ఉత్తమ కథలు