Good news: ఏపీలో ఒక్కొక్కరి ఖాతాలో 18,500.. వచ్చే నెల అమలయ్యే సంక్షేమ పథకాలు ఇవే... ఏ తేదీలో ఇస్తారు?

ఏపీలో వచ్చే నెల సంక్షేమ పథకాల షెడ్యూల్ ఇదే

కరోనా కష్ట సమయంలో సీఎం జగన్ పెద్ద మనసు చాటుకుంటున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. పేదల అవసరాలకు అనుగుణంగానా కొత్త స్కీమ్ లు ప్రకటిస్తున్నారు. తాజాగా జూన్ నెలలో అమలు చేయనున్న పథాకాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • Share this:
    సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఉంటున్నారు. నవరత్నాల పేరుతో ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న ఆయన.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలు పెడుతూ వస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో చాలా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు బ్రేకులు పడ్డాయి.. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నం.. కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోంది. సమయం కాస్త మారినా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పోతోంది. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా జూన్‌లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.

    వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలను జూన్ నెలలో అమలు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో కూడా ప్రభుత్వం స్పష్టత ఇఛ్చింది. వచ్చే నెలలో సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల తేదీలు ఇలా ఉన్నాయి..
    జూన్ 8న – జగనన్న తోడు
    జూన్ 15న – వైఎస్ఆర్ వాహన మిత్ర
    జూన్ 22న – వైఎస్ఆర్ చేయూత



    ముఖ్యంగా కరోనా కాటు కారణంగా చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బ తిన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు, చేతి వృత్తుల వారి పరిస్థితి దారుణంగా మారింది. ఆదాయం మార్గాలు లేక ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాంటి వారికి జగనన్న తోడు పథకం కింద జూన్ 8న ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాలో 10వేల రూపాయల రుణం అందించనుంది. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల సాయాన్ని జూన్ 15న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇదీ చదవండి: ఐ యామ్‌ సోనా... డోంట్ ఫియర్... మీకు ఏ విధంగా సాయపడగలను..

    అర్హులైన 45-60 ఏళ్ల మధ్య మహిళలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద 18 వేల500 రూపాయల చొప్పున జూన్ 22న సాయాన్ని ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేయనుంది. ఈ పథకం కింద ఏటా 18 వేల 750 చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయలు అందజేస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు.

    ఇదీ చదవండి: వైఎస్ భారతిని సీఎం చేయండి.. కరోనా కట్టడి అవ్వాలంటే అదే మార్గం.. విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

    తాజాగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.
    Published by:Nagesh Paina
    First published: